మసీదుల్లోకి మహిళలు: శ‌బ‌రిమ‌ల తీర్పు ఆధారంగా సుప్రీం

  • Published By: vamsi ,Published On : April 16, 2019 / 07:23 AM IST
మసీదుల్లోకి మహిళలు: శ‌బ‌రిమ‌ల తీర్పు ఆధారంగా సుప్రీం

శబరిమల ఆలయంలోకి మహిళల ఎంట్రీ అంశం తర్వాత మరో సంచలన కేసును విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పూణేకు చెందిన ముస్లీం దంపతులు ఆడువారిని మసీదుల్లోకి ఎటువంటి నిబంధనలు లేకుండా అనుమతించాలని వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు విచారణ జరిపింది. 

శబరిమల జడ్జిమెంట్‌ను పరిగనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు మ‌సీదుల్లోకి మ‌హిళ‌లు వెళ్ల‌వ‌చ్చా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు  అంగీక‌రించింది. ఈ మేరకు కేంద్ర ప్ర‌భుత్వానికి, సెంట్ర‌ల్ వ‌క్ఫ్ కౌన్సిల్‌, ఆల్ ఇండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డుకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు అందజేసింది.

అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి వెళ్ల‌వ‌చ్చుననే సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును ఆధారంగా చేసుకుని మ‌సీదుల్లోకి ముస్లిం మ‌హిళ‌లు వెళ్ల వ‌చ్చా లేదా అన్న అంశాన్ని తేల్చాల‌ని భావిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. మ‌హిళ‌ల‌ను మ‌సీదులోకి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకోవ‌డం అక్ర‌మ‌మ‌ని పిటిష‌న్‌లో మస్లీం దంపతులు తెలిపారు.

మహిళలలను మసీదులలోకి రాకుండా అడ్డుకోవడం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని, 14, 15, 21, 25, 29 ఆర్టిక‌ల్స్‌ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని కూడా పిటిష‌న్‌లో వారు చెప్పారు. మ‌హ్మాద ప్ర‌వ‌క్త కానీ.. ప‌విత్ర మ‌త గ్రంధం ఖురాన్ కానీ.. మ‌హిళ‌లు మ‌సీదుకు వెళ్ల‌రాదని చెప్ప‌లేద‌ని, స్త్రీ, పురుషుల‌ను ఖురాన్ వేరుగా చూడ‌లేద‌ని వారు అంటున్నారు.