Ujjain : మహాకాళేశ్వర్ గుడిలో కాబోయే భార్య ఎదుట ఎన్నారై బట్టలు చింపిన సెక్యూర్టీ గార్డు

లండన్ కు చెందిన రవి కాబోయే భార్య, స్నేహితుడితో భారత్ కు ఇటీవలే వచ్చారు. మంగళవారం మహాకాళేశ్వర్ గుడికి వెళ్లారు.

Ujjain : మహాకాళేశ్వర్ గుడిలో కాబోయే భార్య ఎదుట ఎన్నారై బట్టలు చింపిన సెక్యూర్టీ గార్డు

Ujjayani

Security Guard Tears Clothes : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో ఓ ఎన్నారైకి ఘోర అవమానం ఎదురైంది. కాబోయే భార్య ఎదుటే ఆలయ సెక్యూర్టీ గార్డు దుస్తులు చించేశాడు. దాడి చేశాడంటూ..ఆ ఎన్నారై మహాకాళ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. దర్శన టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్నారనే ఇప్పటికే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. మరోసారి…ఎన్నారైపై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Read More : Stegosaurus: గుడ్డునుంచి పుట్టగానే ఆకాశంలోకి దూసుకుపోయే పక్షి..228 మిలియన్‌ ఏళ్లనాటి ఈ భారీ జీవి విశేషాలు..

దసరా నవరాత్రి ఉత్సవాలు 2021, అక్టోబర్ 07వ తేదీన ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి మహాకాళేశ్వర్ ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. లండన్ కు చెందిన రవి కాబోయే భార్య, స్నేహితుడితో భారత్ కు ఇటీవలే వచ్చారు. మంగళవారం మహాకాళేశ్వర్ గుడికి వెళ్లారు. వీఐపీ పద్ధతిలో దర్శనానికి అనుమతి ఉంది. అందరిలాగా కాకుండా..సాధారణ టికెట్ కొనుక్కొని దర్శనానికి వెళ్లారు. అయితే…దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా…దారి తెలియక రవికి కాబోయే భార్య ఇబ్బంది పడ్డారు.

Read More : Mahindra xuv700 : కొత్త కారు.. 57 నిమిషాల్లో 25,000 బుకింగ్‌లు

అక్కడనే ఉన్న సెక్యూర్టీ గార్డు ఆమె పట్ల దురుసగా ప్రవర్తించారని, దీనిని ప్రశ్నించినందుకు తనపై దాడికి పాల్పడ్డారని ఎన్నారై రవి ఆరోపించారు. తాను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, సెక్యూర్టీగార్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడికి న్యాయం చేస్తామని, విచారణలో సెక్యూర్టీ గార్డు తప్పు చేశాడని తేలితే..శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడిస్తున్నారు.