Stegosaurus: గుడ్డునుంచి పుట్టగానే ఆకాశంలోకి దూసుకుపోయే పక్షి..228 మిలియన్‌ ఏళ్లనాటి ఈ భారీ జీవి విశేషాలు..

గుడ్డునుంచి పుట్టగానే ఆకాశంలోకి దూసుకుపోయే పక్షి గురించి మీకు తెలుసా? 228 మిలియన్‌ ఏళ్లనాడు ఈ భూమ్మీద నివసించి అత్యంత భారీ జీవులు ఏమైపోయాయి?

Stegosaurus: గుడ్డునుంచి పుట్టగానే ఆకాశంలోకి దూసుకుపోయే పక్షి..228 మిలియన్‌ ఏళ్లనాటి ఈ భారీ జీవి విశేషాలు..

Stegosaurus

Stegosaurus: ప్రముఖ హాలీవుడ్ మూవీ  జురాసిక్ పార్క్  Steven Spielberg అద్భుత సృష్టి అయితే జేమ్స్‌ కామెరాన్‌ అద్భుతసృష్టి అవతార్ సినిమా. ఈ భారీ జీవులు కేవలం కల్పితాలు మాత్రమే..ఇటువంటివి అస్సలు భూమ్మీద జీవించాయి అంటే నమ్మబుద్ది కాదు. కానీ నిజమే. వాస్తవాల్లోంచే కొన్ని సినిమాలు రూపు దిద్దుకుంటాయని చెప్పటానికి ఇటువంటి సినిమాలు నిదర్శనంగా కనిపిస్తాయి. అటువంటివాటికి మరింత సినిమాటిక్ గా దర్శకులు కనువిందుగా..అత్యద్భుతంగా రూపొందించి అలరిస్తారు. కానీ ఇటువంటి భారీ జీవులకు ఈ భూమి ఆలవాలంగా ఉండేదనేది మాత్రం వాస్తవం. దానికి పరిశోధకులు జరిపిన అధ్యయనాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అటువంటివాటిలో అత్యం భారీ జీవి..228 మిలియన్ల ఏళ్లనాటి భారీ సరీసృపం స్టెనోసార్స్..!!!

ఈ భూమి ఒకప్పుడు అత్యంత భారీ జీవులకు ఆలవాలంగా ఉండేది. భారీ జీవులు అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేవి డైనోసార్లు మాత్రమే. కానీ అంతకంటే భారీ జంతువులు ఉన్నాయనే విషయం పరిశోధకులు జరిపే తవ్వకాల్లో బయటపడుతున్నాయి. వీటి ఆకారాన్ని మనం ఊహించలేంకూడా. అంత భారీగా ఉంటాయి. వీటిల్లో సరీసృపాలు కూడా ఉన్నాయి. 10 మీటర్లకు పైగా పొడవాటి రెక్కలతో ఆకాశాన్ని శాసించిన ఓ సరీసృపం అవశేషాలను పరిశోధకులు గుర్తించారు. దాని పేరు ‘స్టెరోసార్స్’‌. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో పాలియోంటాలజీకి చెందిన కెవిన్‌ పాడియన్‌తో పాటు మరికొంతమంది పరిశోధకులు కొన్ని భారీ శిలాజాలపై శాస్త్రీయ అధ్యయనం చేయగా ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

228 మిలియన్‌ ఏళ్లనాటి స్టెరోసార్స్..
స్టెరోసార్స్‌. భారీ సరీసృపం. 228 మిలియన్‌ సంవత్సరాల క్రితం జీవం పోసుకున్న ఈ భారీ జీవి గురించి ఎన్నో వింతలు విశేషాలు వెల్లడయ్యాయి. 66 మిలియన్‌ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ స్టెరోసార్స్ అత్యంత పురాతన ఎరిగే సరీసృపాలుగా పరిశోధకులు గుర్తించారు. డైనోసార్లు జీవించిన కాలంలోనే ఇవి కూడా జీవించాయని పరిశోధకులు తేల్చారు.డైనోసార్ల వలెనే ఈ స్టెరోసార్స్ కూడా గుడ్లను పెట్టి పొదుగి పిల్లల్ని చేస్తాయి. స్టెరోసార్స్‌ను ఎగిరే డైనోసార్లు అని కూడా అంటారు. కానీ వీటి ఆవిర్భావం దశలో అంటే ప్రారంభం దశలో స్టెరోసార్స్ ఎలా జీవనం సాగించాయో ఇప్పటికీ పరిశోధకులకు తెలియలేదు. అంటే అవి అంత పురాతనమైనవన్నమాట. కానీ పరిశోధకులు తలచుకుంటేతెలియదేముంటుంది?అందుకే వీటి ప్రారంభ దశలో ఎలా జీవించేవో పరిశోధన మధనం చేస్తున్నారు.

Read more : Kolleru Pelicon : గూడకొంగకు అరుదైన గుర్తింపు..కొల్లేరు అంబాసిడర్‌గా ప్రకటించిన అటవీశాఖ

గుడ్డు నుంచి బయటపడగానే ఆకాశంలోకి..
ఏ పక్షి జాతి అయినా గుడ్లే పెడతాయి. గూడు కట్టుకుని గుడ్లు పెట్టి పొదుగుతాయి. అలా పొదిగిన కొన్నిరోజులకు గానీ వారాలకు గాని గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి. అలా గుడ్డునుంచి బయటకు వచ్చిన పక్షి పిల్ల పుట్టగానే ఎగరలేదు.తల్లి పెట్టే ఆహారం తింటు రెక్కలకు ఈకలు వచ్చాక..మెల్లి మెల్లిగా ఎగరటం నేర్చుకుని ఎగురుతుంది. కానీ స్టెరోసార్స్ అలా కాదు.గుడ్డులోంచి బయటకు వచ్చిన వెంటనే ఆకాశాలోకి తన రెక్కలతో దూసుకుపోతుంది.గుడ్డునుంచి బయట పడగానే రివ్వున ఎగిరిపోవటం స్టెరోసార్స్ స్పెషల్. గుడ్డు నుంచుి పుట్టిన వెంటనే ఎగిరే పక్షి ఈ స్టెరోసార్స్‌. అలా.. ఇలా.. కాదు.. తల్లితో సమానంగా ఇంకాస్త వివరంగా చెప్పాలంటే తల్లి కంటే సౌకర్యవంతంగా ఆకాశమార్గాన ప్రయాణిస్తుంది.

గాలితో నిండి ఉండే ఆస్థికల వల్లే అలా ఎగిరే సత్తా..
అలా పుట్టగానే స్టెరోసార్స్ ఎగరటానికి కారణం..స్టెరోసార్స్‌ శరీర నిర్మాణమేనంటున్నారు శాస్త్రవేత్తలు. వాటి పిండాలు, పిల్లలు, పెద్ద జీవుల్లో ఆస్థికలను పోల్చి పరిశోధన చేయగా ఈ విషయం తెలిసింది. దీని ఆస్థికలు బలంగా ఉండి.. గాలితో నిండి ఉంటాయి. పిల్ల సరీసృపాలు పెద్ద వాటి కంటే చురుకుగా ఎరగగలుగుతాయి. రెక్కలు చిన్నగా ఉన్నా.. విస్తృతంగా ఉండటంతో చిన్నవి పెద్ద వాటి కంటే సులభంగా గమ్యాన్ని మార్చుకోగలవు.అలాగే వేగాన్ని వెంటనే కంట్రోల్ చేసుకోగలవు.

Read more : Kolleru Pelicon : గూడకొంగకు అరుదైన గుర్తింపు..కొల్లేరు అంబాసిడర్‌గా ప్రకటించిన అటవీశాఖ

అయితే పెద్దవి ప్రయాణించినంత దూరం పిల్లు ఏకదాటిగా వెళ్లలేవు. అంత భారీగా ఉన్నా పిల్ల స్టెరోసార్స్‌కు ఇతర వాటినుంచి ప్రమాదం ఉంటేది. పుట్టగానే ఎగడరం అనేది ఇతర ప్రాణుల నుంచి రక్షణ కోసమేనని వీటిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర ప్రాణాల నుంచి రక్షణకే కాదు.. దట్టమైన అడవులను దాటడానికి ఈ బలమైన రెక్కలు వీటికి బాగా ఉపయోగపడేవి.డైనోసార్ల కాలంలోనే ఈ స్టెరోసార్స్ జీవించాయని..వీటితో పాటు అత్యం భారీ మొసళ్లు, ప్లీసియోసార్‌ వంటి మనుగడసాగించేవని తేల్చారు. ఆ కాలాన్ని మెసోజాయిక్‌ శకం అని పరిశోధకలు తెలిపారు. ఆనాటి 100 కంటే ఎక్కువ జాతుల శిలాజాలను శాస్త్రవేత్తలు ఇటీవలే కనుగొన్నారు. ఆ అవశేషాలను పరిశీలించగా హృదయ విధారక విషయాలు తెలిశాయి.

ఇంత భారీ జీవులు కూడా ఆకలితోనే చనిపోయాని గుర్తించారు. ఇది చాలా హృదయవిదారకమైన ఘటన అని అన్నారు. ఆ జీవుల్లో కొన్ని తినడానికి తిండిలేక మరణించాయని..తెలిపారు. ప్లీసియోసార్‌కు పొడవాటి మెడ ఉండి.. డజన్ల కొద్దీ ఎముకలు ఉంటాయి. పెంగివన్‌కు ఉండే పొడవైన ఫ్లిప్పర్‌లు ఈదడానికి తోడ్పడతాయి. ప్లీసియోసార్లకు త్రిమింగలం లాంటి మోసాసార్‌ల నుంచి ముప్పు ఉండేది. అవి వీటిని వేటాడి తినేవి. ఈ మోసాసార్‌లను సముద్ర రాక్షసులుగా పిలుస్తారని పరిశోధకులు వివరించారు. మన అవతార్ సినిమాలో ఉండే ఈ స్టెరోసార్స్‌.