Mukesh Ambani: ముకేష్ అంబానీ ఇంటి దగ్గర హైఅలర్ట్.. ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్‌తో కలకలం..

ముకేష్ అంబానీ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్ అందుకు కారణం. ముంబైలోని అంబానీ నివాసం ఆంటిల్లా గురించి ఇద్దరు..

Mukesh Ambani: ముకేష్ అంబానీ ఇంటి దగ్గర హైఅలర్ట్.. ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్‌తో కలకలం..

Mukesh Ambani

Mukesh Ambani: అపర కుబేరుడు, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముకేష్ అంబానీ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్ అందుకు కారణం. ముంబైలోని అంబానీ నివాసం ఆంటిల్లా గురించి ఇద్దరు వ్యక్తులు తనను అడిగారని, వారి దగ్గర రెండు పెద్ద బ్యాగ్ లు ఉన్నాయని, వాళ్లు అడ్రస్ తెలుసుకుని ఆంటిల్లా వైపుగా వెళ్లారని ఆ ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.

Zinc : జింక్ తో జలుబు, దగ్గుకు చెక్…పరిశోధనల్లో వెల్లడి

రెండు బ్యాగులతో ఇద్దరు వ్యక్తులు అంబానీ నివాసం వైపు వెళ్లారనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ముకేష్ అంబానీ నివాసం దగ్గర అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. కాగా, ట్యాక్సీ డ్రైవర్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశామని, ఓ సీనియర్ పోలీసు అధికారి పర్యవేక్షణలో దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

గత ఫిబ్రవరిలో ముఖేశ్ అంబానీ నివాసం ముందు ఓ కారులో పేలుడు పదార్థాలు లభ్యం కావడం, దాని వెనుక పెద్ద కుట్ర బయటపడడం ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. అప్పటినుంచి ఆంటిల్లా దగ్గర చీమ చిటుక్కుమన్నా పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్ ను తేలిగ్గా తీసుకోకుండా దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపారు.