ఢిల్లీ..షాహీన్‌బాగ్‌ ఉద్యమంలో ఆత్మాహుతి దళాలు తయారవుతున్నాయి: బీజేపీ మంత్రి 

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 05:40 AM IST
ఢిల్లీ..షాహీన్‌బాగ్‌ ఉద్యమంలో ఆత్మాహుతి దళాలు తయారవుతున్నాయి: బీజేపీ మంత్రి 

దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో ఆందోళనలు ఆత్మాహుతి దళాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతున్నాయని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు షాహీన్‌బాగ్ వద్ద కొనసాగుతున్న నిరసనలు…ఖిలాఫత్ ఉద్యమంతో సమానమనీ..ఈ ఆందోళనలు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని మంత్రి ఆరోపించారు. 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో గత 50 రోజులకు పైగా  కొనసాగుతున్న నిరసనలు ఆత్మాహుతి దళాల ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారని గిరిరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి గిరిరాజ్ సింగ్ ఢిల్లీలోని కలిండి కుంజ్ ప్రాంతంలోని షాహీన్ బాగ్ స్ట్రెచ్ వద్ద నిరసనకారుల వీడియోను పోస్ట్ చేశారు. 

కాగా..పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 50 రోజులుగా షాహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలను అణచి వేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రం బలప్రయోగం చేయవచ్చని..దీంతో ఫిబ్రవరి 8 తరువాత అంటే షాహీన్‌బాగ్‌ మరో జలియన్ వాలాబాగ్ గా మార్చొచ్చని హైదరాబాద్ ఎంఐఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి.