Chai Wal Sharmistha Ghosh : బ్రిటీష్‌ కౌన్సిల్‌లో ఉద్యోగం కూడా మానేసి చాయ్ వాలాగా మారిన యువతి

ఎంఎ ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదువుకున్న ఓ యువతి. బ్రిటీష్‌ కౌన్సిల్‌లో మంచి ఉద్యోగం చక్కటి జీతం..కానీ ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేదు. ఉద్యోగానికి రిజైన్ చేసి వీధిలో ఓ టీ స్టాల్ నుడుపుతోంది. ఆమే శర్మిష్టా ఘోష్.

Chai Wal Sharmistha Ghosh : బ్రిటీష్‌ కౌన్సిల్‌లో ఉద్యోగం కూడా మానేసి చాయ్ వాలాగా మారిన యువతి

Chai Wal Sharmistha Ghosh In Delhi

Chai Wal Sharmistha Ghosh : ఉన్నత చదువులు చదువుకున్న ఎవరైనా మంచి ఉద్యోగం..చక్కటి జీతం వస్తే చక్కగా దాంట్లోనే కంటిన్యూ అయిపోతుంటారు.కానీ శర్మిష్ట ఘోష్‌ అనే యువతి ఆలోచనలే వేరు. ఆమె చదివింది ఎంఎ ఇంగ్లీష్‌ లిటరేచర్‌.బ్రిటీష్‌ కౌన్సిల్‌లో ఉన్నత ఉద్యోగం చేసే శర్మిష్టకు ఏదో వెలితి. తను చేయాల్సింది ఇది కాదు అనే భావన.చక్కటి ఉద్యోగం చేస్తున్నా ఆమెకు ఏదో చేయాలనే తపన.. ఈ ఆలోచనలు ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. కారణం టీ కంపెనీ స్థాపించాలని లక్ష్యమే. అందుకే ఉద్యోగం మానేసి ఓ చిన్న టీ స్టాల్ పెట్టుకుంది. ఉన్నత చదువులు చదివి బ్రిటీష్‌ కౌన్సిల్‌లో ఉద్యోగం చేసిన శర్మిష్ట తన లక్ష్యం కోసం చిన్న టీ దుకాణం నడుపుతున్నారు. వినూత్నంగా ఆలోచించే యువతి శర్మిష్ట టీ సెటప్ చూడాలంటే ఢిల్లీలోని గోపీనాథ్ బజర్ కు వెళ్లాల్సిందే.

ఢిల్లీకి చెందిన శర్మిష్ట ఘోష్‌ ఎంఎ ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదువుకున్నారు. బ్రిటీష్‌ కౌన్సిల్‌లో మంచి ఉద్యోగం చేసేవారు. కానీ ఆమె జీవితంలో ఏదైనా సాధించాలని అనుకున్నారు శర్మిష్ట. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలనుకున్నారు. దేశంలో ప్రసిద్ధ టీ సెటప్‌ అయిన చాయోస్‌లా తను కూడా ఓ టీ కంపెనీ స్థాపించాలని నిర్ణయించుకున్నారు శర్మిష్ట. కానీ అనుకోగానే అయిపోతుందా.. ఏమిటి.? అనుభవంలేని రంగంలో రాణించడం ఎలా అని ఆలోచించారు శర్మిష్ట. ముందుగా ఢిల్లీలోని గోపీనాథ్ బజార్‌లో ఓ చిన్న టీ స్టాల్‌ను ప్రారంభించారు శర్మిష్ట ఘోష్‌.

ఎంత దూరమైనా చిన్న అడుగుతోనే ప్రారంభించాలి కదా.. ఈ విధంగానే శర్మిష్ట తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వీధి బండిపై టీ విక్రయిస్తూ ఆ వ్యాపారంలోని లోటుపాట్లను తెలుసుకుంటున్నారు శర్మిష్ట ఘోష్‌. చూడచక్కగా ఉన్న యువతి.. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతున్న శర్మిష్ట ఘోష్‌ చిన్న దుకాణంలో టీ అమ్మడం చూసి ఆశ్చర్యపోయారు ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ బ్రిగేడియర్ సంజయ్ ఖన్నా. ఆమెతో మాట్లాడితే గాని తెలియలేదు ఆయనకు ఆమె ఓ పెద్ద ఉద్యోగాన్ని వదులుకుని ఉన్నత లక్ష్యంతో చిరు ప్రయత్నం చేస్తోందని..

శర్మిష్ట లక్ష్యానికి ముగ్ధుడైన రిటైర్డ్‌ బ్రిగేడియర్‌ సంజయ్‌ ఆమె స్టోరీని లింక్డ్‌ ఇన్‌లో షేర్‌ చేశారు. అంతవరకు శర్మిష్ట కోసం తెలియని ప్రపంచానికి ఆమెను గొప్పగా పరిచయం చేశారు. నేను ఆమె అనుమతితో ఈ పోస్ట్‌ వ్రాస్తున్నాను.. తక్కువదనో.. చిన్న ఉద్యోగమనో పిలవడానికి ఏమీ లేదు. ఇలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అంటూ శర్మిష్టపై ప్రశంసలు కురిపించారు సంజయ్‌ ఖన్నా. కలలను సాకారం చేయాలంటే కృషితోపాటు అభిరుచి, చిత్తశుద్ధి ఉండాలని శర్మిష్ట చాటిచెబుతున్నారు.

శర్మిష్ట ప్రయత్నానికి స్నేహితుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఉద్యోగానికి రాజీనామా చేసి అంగడిలో టీ అమ్ముతున్న శర్మిష్టకు అండగా నిలిచింది స్నేహితురాలు భావనారావు. ఆమె కూడా లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో పనిచేసేది. శర్మిష్టతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న భావనారావు చిన్న చాయ్ స్టాల్ నిర్వహణలో జాయింట్ పార్టనర్‌గా చేరిపోయింది. శర్మిష్ట, భావనారావుల బిజినెస్‌ జర్నీపై లింక్డ్‌ ఇన్‌లో షేర్‌ చేసిన పోస్టుకు విశేష ఆదరణ లభిస్తోంది. రిటైర్డ్‌ బిగ్రేడియర్‌ సంజయ్‌ ఖన్నా పోస్టును చాలామంది రీపోస్ట్‌ చేశారు. లైక్‌లు, పాజిటివ్‌ పోస్టులతో ట్రెండ్‌ అవుతోంది శర్మిష్ట స్టోరీ.

s