Aaditya Thackeray: షిండే ప్రభుత్వంపై ఆదిత్య థాకరే ఆగ్రహం.. మహారాష్ట్ర యువత లక్షలాది ఉద్యోగాలు కోల్పోయారంటూ ఆవేదన

మహారాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, అజ్ఞానం కారణంగా రెండు పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని, తద్వారా లక్షలాది ఉద్యోగాలను మహారాష్ట్ర యువత కోల్పోయిందని శివసేన నాయకుడు ఆదిత్య థాకరే ఆవేదన వ్యక్తం చేశారు.

Aaditya Thackeray: షిండే ప్రభుత్వంపై ఆదిత్య థాకరే ఆగ్రహం.. మహారాష్ట్ర యువత లక్షలాది ఉద్యోగాలు కోల్పోయారంటూ ఆవేదన

aaditya thackeray

Aaditya Thackeray: మహారాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అజ్ఞానం కారణంగానే లక్షలాది ఉద్యోగాలను మహారాష్ట్ర కోల్పోయిందని శివసేన నాయకుడు ఆదిత్య థాకరే ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి ఉదయ్ సామంత్ రాష్ట్రానికి వచ్చిన రెండు పెద్ద కంపెనీల ప్రాజెక్టులను వారి అసమర్థత కారణంగా కోల్పోయాడని ఆదిత్య థాకరే ఆరోపించారు.

Aaditya Thackeray on Eknath Shinde: ఏక్‭నాథ్ షిండేపై విరుచుకుపడ్డ ఆదిత్య థాకరే

గతంలో మహావికాస్ అఘాడి ప్రభుత్వం వేదాంత-ఫాక్స్‌కాన్ ప్రాజెక్టును మహారాష్ట్రలో నెలకొల్పేందుకు ఎంతో కష్టపడిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం విధానంతో ఆ ప్రాజెక్ట్ గుజరాత్ కు మార్చాలని నిర్ణయించుకున్నారని, ఇదే సమయంలో మరో ప్రాజెక్ట్ బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్ట్, ఇది గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మూడు రాష్ట్రాలకు వెళ్లిందని అన్నారు. రాష్ట్రంలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం అవగాహనలేమితో మహారాష్ట్ర యువతకు తీవ్ర అన్యాయం చేసిందని ఆదిత్య థాకరే ఆరోపించారు.

Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు

మహారాష్ట్రం పరిశ్రమల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి షిండే అజ్ఞానం వల్లనే మహారాష్ట్ర రెండు భారీ ప్రాజెక్టులు కోల్పోయి లక్షల ఉద్యోగాలను చేజేతులా వదిలేసుకుందని అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో సైనిక విమానాలను తయారు చేసేందుకు ఎయిర్‌బస్-టాటా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా దృష్టి సారించాలని ఆదిత్య ఠాక్రే అన్నారు. ఇది నాగ్‌పూర్‌కు రావాలని, ప్రస్తుత ప్రభుత్వం కనీసం దీనిపైన అయిన దృష్టిసారిస్తారని ఆశిస్తున్నట్లు ఆదిత్య థాకరే పేర్కొన్నారు.