Reduced Corona Cases : భారత్‌లో కరోనా కేసులు తగ్గినా పెరుగుతున్న మరణాలు.. 2 వారాల్లో 50 వేల మంది మృతి

దేశంలో క‌రోనా ఉధృతి స్వల్పంగా త‌గ్గింది. నిన్నటితో పోల్చితే సుమారు 40 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి.

Reduced Corona Cases : భారత్‌లో కరోనా కేసులు తగ్గినా పెరుగుతున్న మరణాలు.. 2 వారాల్లో 50 వేల మంది మృతి

Slightly Reduced Corona Positive Cases In India

reduced corona cases in India : దేశంలో క‌రోనా ఉధృతి స్వల్పంగా త‌గ్గింది. నిన్నటితో పోల్చితే సుమారు 40 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 3 లక్షల 29 వేల 519 మందికి కరోనా సోకింది. కానీ మరణాలు నిన్నటి కంటే ఎక్కువే నమోదయ్యాయి. 24 గంటల్లో 3 వేల 879 మంది కరోనాకు బలయ్యారు. గ‌త నాలుగు రోజులుగా ప్రతిరోజూ నాలుగు ల‌క్షల‌కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ప‌రంప‌ర‌కు కాస్తా బ్రేక్ ప‌డింది. కరోనా నుంచి రికవరీ అవుతున్న బాధితుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశం.

దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. కేవలం రెండు వారాల్లోనే 50 వేల మంది చనిపోయారంటే దేశంలో కరోనా ఉధృతి ఎలా ఉందో అర్థమవుతోంది. ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 37 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 2.29 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 3.55 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలోని ప్రతి ఐదు జిల్లాల్లోని రెండింటిలో 20 శాతం కంటే ఎక్కువ కరోనా పాజిటివిటీ రేటు నమోదవుతోంది. ఫిబ్రవరిలో సెకండ్ వేవ్ ప్రభావం మొదలవగా అక్కడి నుంచి కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రా్లలో క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్, కర్ఫ్యూ, వారంతపు లాక్‌డౌన్లు అమలవుతున్నాయి.

రెండు రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో… సెకండ్ వేవ్ అయితే వ్యాప్తి మందగించిందని అంచనా వేస్తున్నారు అధికారులు. వాస్తవంగా ఫిబ్రవరి సెకండ్‌ వీక్‌లో సెకండ్ వేవ్ ప్రభావం కనిపించినా.. మార్చ్ సెకండ్ వీక్ నాటికి కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ఏప్రిల్ 30నాటికి రికార్డు స్థాయిలో ఒకే రోజు 4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత… మే 3నాటికి సగటున 3 లక్షల 60వేలకు పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.

దీంతో ఇండియాలో కోవిడ్ పీక్‌స్టేజ్ దాటిందని అంచనా వేశారు. కానీ.. ఆ తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. కానీ.. రెండు రోజులుగా కేసులను బట్టి చూస్తే.. కరోనా సెకండ్ వేవ్ మందగించినట్టు కనిపిస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి స్థిరత్వానికి చేరిందని.. త్వరలోనే కేసుల సంఖ్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కేసులు నమోదవుతున్న దేశంగా భారత్‌ మొదటిస్థానంలో ఉంది. ఒవరాల్‌గా అమెరికాలో అత్యధిక కేసులు రికార్డ్ అయ్యాయి. ఇండియా సెంకడ్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, ఫ్రాన్స్, టర్కీ, రష్యా, యూకే, ఇటలీ, స్పెయిన్, జర్మనీ టాప్ టెన్ ప్లేసుల్లో ఉన్నాయి.