Hindustan-228 : స్వదేశీ పరిజ్ఞానంతో చిన్నపౌరవిమానం…విజయవంతమైన గ్రౌండ్ రన్

ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ఈ తరహా చిన్న విమానాలు ఎంతగానో దోహదపడనున్నాయి.

Hindustan-228 : స్వదేశీ పరిజ్ఞానంతో చిన్నపౌరవిమానం…విజయవంతమైన గ్రౌండ్ రన్

Hindhusthan

Hindustan-228 : స్వదేశీ పరిజ్ఞానంతో హిందూస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చిన్న పౌర విమానాన్ని రూపొందించింది. హిందూస్ధాన్-228 పేరుతో పిలవబడుతున్న ఈ విమానం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ టైప్ సర్టిఫికెట్ కోసం గ్రౌండ్ రన్, లో స్పీడ్ టాక్సీ ట్రయల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 75 వస్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించనట్లు హిందూస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వెల్లడించింది.

ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ఈ తరహా చిన్న విమానాలు ఎంతగానో దోహదపడనున్నాయి. రాష్ట్రాలు , అంతరాష్ట్రాల మధ్య ఎయిర్ కనెక్టివిటీ అవకాశాలు మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని పరీక్షలు, విన్యాసాల అనంతరం హిందూస్ధాన్-228 ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అతిచిన్న విమానాల రూపకల్పనకు ఇదో ముందడుగని హిందూస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సీఈఓ సాజల్ ప్రకాష్ తెలిపారు.

19సీటర్ల ఈ ప్రత్యేక విమానం వీఐపీలు, ప్రయాణికులు, ఎయిర్ అంబులెన్స్, వైమానిక పరీక్షలు, మేఘమధనం, ఇతర అవసరాలకు దీనిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విమానాలు రాకపోకలు సాగించేందుకు అతిపెద్ద ఎయిర్ పోర్టులు అవసరంలేదు. తక్కువ విస్తీర్ణంలో మిని ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేసుకుంటే విమాన రాకపోకలు సాగించేందుకు ఈజీగా ఉంటుంది. టైప్ సర్టిఫికెట్ హిందూస్ధాన్ 228 ఎయిర్ క్రాఫ్ట్ కు అంతర్జాతీయ సర్టిఫికెట్ పొందేందుకు వీలు కలిగిస్తుందని డీజీసీఏ డైరెక్టర్ ఇంద్రనీల్ చక్రవర్తి తెలిపారు.