మోడీ హామీలు ప్రజలకు గుర్తు చేసిన సోనియా

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2019 / 04:02 PM IST
మోడీ హామీలు ప్రజలకు గుర్తు చేసిన సోనియా

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు గాను గురువారం(మే-2,2019) మొదటి ఎన్నికల ర్యాలీలో యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు.ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో  సోనియా పాల్గొన్నారు.రాయబరేలీ నుంచి సోనియా గాంధీ వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

 రాయబరేలీ ర్యాలీలో ప్రజలనుద్దేశించి సోనియా మాట్లాడుతూ…త్వరలో మీరందరూ ఓటు వేయబోతున్నారు.మీ ఓటు చాలా విలువైనది.మీ చేతుల్లో ఉన్న బలమైన ఆయుధం ఓటు. గత ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు చేసిన వాగ్ధానాలను మీరు తప్పక గుర్తు చేసుకోవాలి.ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15లక్షలు వేస్తామని,రెండు కోట్ల ఉద్యోగాలు అని గత ఎన్నికల సమయంలో మోడీ చెప్పారు.అయితే వాస్తవం చాలా వేరుగా ఉంది.యువత ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని సోనియా అన్నారు. ఇటీవల కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి రాయబరేలీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దినేష్ ప్రతాప్ సింగ్ పై ఈ సందర్భంగా సోనియా జాలిపడ్డారు.బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి రాయబరేలీలో సోనియాపై అభ్యర్థిని నిలబెట్టలేదు.

ఐదో దశలో భాగంగా మే-6,2019న రాయబరేలీ స్థానానికి పోలింగ్ జరగనుంది.హెల్త్  కారణాలతో సోనియాగాంధీ ప్రచారాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు.చివరిసారిగా గతేడాది డిసెంబర్ లో తెలంగాణలోని మేడ్చల్ లో ఎన్నికల ర్యాలీలో సోనియా పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే