Sonu Sood : బతికించలేకపోయా.. కరోనాతో భారతి మృతి, ఎమోషనల్ అయిన సోనూసూద్

బాలీవుడ్ నటుడు, మానవతావాది, రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూసూద్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను బతికించలేకపోయా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కరోనాతో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడేందుకు తాను ప్రయత్నించినా, చివరికి విషాదమే మిగిలిందని

Sonu Sood : బతికించలేకపోయా.. కరోనాతో భారతి మృతి, ఎమోషనల్ అయిన సోనూసూద్

Sonu Sood Breaks Down Over Death Of Covid Positive Young Girl

Sonu Sood : బాలీవుడ్ నటుడు, మానవతావాది, రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూసూద్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను బతికించలేకపోయా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కరోనాతో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడేందుకు తాను ప్రయత్నించినా, చివరికి విషాదమే మిగిలిందని సోనూసూద్ వాపోయారు. నా గుండె బద్దలైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు ఆమె పోరాటం చేసింది, చివరకు శుక్రవారం(మే 7,2021) తుదిశ్వాస విడిచింది, అని సోనూ తెలిపారు. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో మనం ఊహించలేము అంటూ ట్వీట్ చేశారు సోనూసూద్.

మహారాష్ట్రలోని నాగ్ పూర్ కి చెందిన భారతి అనే యువతి ఇటీవల కరోనా బారిన పడగా, ఆమెకు ఊపిరితిత్తులు 85శాతం దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల మార్పిడి లేదా మెరుగైన చికిత్స అందించాలని వైద్యుల సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ భారతి కోసం ఓ ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారతి తుదిశ్వాస విడిచింది.

“క‌రోనా బాధ‌ప‌డుతున్న‌ భారతి అనే యువతిని ఇటీవల నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లో తీసుకొచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చికిత్స పొందుతూ ఆమె శుక్ర‌వారం రాత్రి క‌న్నుమూసింది. నెల రోజులపాటు ఆసుపత్రిలో పోరాటం చేసింది. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆమెను బతికించేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించా. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో మనం చెప్ప‌లేం. నా హృదయం ముక్కలైంది” అని సోనూసూద్ ట్వీట్ చేశారు.

దేశం విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్నప్పుడు.. మేమున్నాం..అంటూ.. పలువురు రియ‌ల్ హీరోలు ముందుకు వ‌చ్చారు. అలా వచ్చిన వారిలో అక్ష‌య్ కుమార్, సోనూసూద్ ముందు వ‌ర‌స‌లో ఉన్నారు. ముఖ్యంగా సోనూ సూద్.. ఎంతోమందికి ఎన్నోరకాలుగా సాయం చేశారు, చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం సోనూ చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ సాయం అంటే చాలు ఏదో ఒక ర‌కంగా వారికి అండ‌గా నిలుస్తున్నారు. కరోనా మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి కష్టాల్లో ఉన్న వారికి ఎన్నో రకాలుగా సాయం చేసి దేశ ప్ర‌జ‌ల‌కు హీరో అయ్యాడు సోనూ సూద్. పేదలు అతడిని దైవంతో సమానంగా చూస్తారు.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)