కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

  • Published By: murthy ,Published On : June 1, 2020 / 08:53 AM IST
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణీ కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురందించింది. నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింది.  నైరుతి  రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లాం, పతనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం, కన్నూర్‌ జిల్లాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో  ఇవాళ పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
 
కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు  విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో లక్షదీప్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో  రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నైరుతీ రుతుప‌వ‌నాల వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌కాలంలో 75 శాతం వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అరేబియా స‌ముద్రంలో నిస‌ర్గ తుఫాన్ ఏర్ప‌డ‌డంతో.. నైరుతీ రాక ఈజీగా మారిన‌ట్లు ఐఎండీ అంచ‌నా వేస్తున్న‌ది. ఈ ఏడాది నూరు శాతం సాధార‌ణ వ‌ర్ష‌పాతం ఉండే అవ‌కాశాం ఉన్న‌ట్లు ఏప్రిల్‌లోనూ కేంద్ర భూగ‌ర్భ మంత్రిత్వ‌శాఖ కార్య‌ద‌ర్శి మాధ‌వ‌న్ రాజీవ‌న్ తెలిపారు.

Read:  నైరుతి వచ్చేస్తోంది..మరో తుఫాన్ ముప్పు