Uttar Pradesh: క్రీడాకారులకు టాయిలెట్‌లో భోజనాలు.. వీడియో వైరల్.. అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఉత్తరప్రదేశ్ కబడ్డీ క్రీడాకారులకు టాయిలెట్‌లో భోజనాలు వడ్డించారు. దీంతో వారు ఇబ్బందిపడుతూ భోజనం చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో  తీవ్ర దుమారానికి దారితీసింది.

Uttar Pradesh: క్రీడాకారులకు టాయిలెట్‌లో భోజనాలు.. వీడియో వైరల్.. అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

Uttar Pradesh government

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ కబడ్డీ క్రీడాకారులకు టాయిలెట్‌లో భోజనాలు వడ్డించారు. దీంతో వారు ఇబ్బందిపడుతూ భోజనం చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో  తీవ్ర దుమారానికి దారితీసింది. సెప్టెంబర్ 16న సహరాన్‌పూర్‌ జిల్లాలో బాలికలకోసం అండర్-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కదులుతున్న డొంక.. ఈడీ సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలు ..

ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు భోజనాన్ని టాయిలెట్‌ గదిలో గిన్నెలు ఉంచి వడ్డించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోల ప్రకారం.. టాయిలెట్ గదిలో అన్నం, పప్పు, కూరల పాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు ఉంది. పూరీలను టాయిలెట్ గదిలోనే ఓ పేపర్‌పై ఉంచడాన్ని వీడియోలో చూడొచ్చు. ఒక నిమిషం నిడివి గల వీడియోలో భోజనం ఉంచినచోటే టాయిలెట్ సింకులు ఉండటాన్ని చూడొచ్చు. ఆటగాళ్ళు ఆహారం తీసుకొని టాయిలెట్ నుండి బయటకు వెళ్లడం వీడియోలో కనిపించింది.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తీవ్ర వివాదానికి దారితీసింది. ఫలితంగా యూపీ ప్రభుత్వం, అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనపై సహరన్‌పుర్ క్రీడా అధికారి అనిమేశ్ సక్సేనా స్పందించారు. భోజనాలను టాయిలెట్ లో ఏర్పాటు చేయలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వంట పాత్రలను ఛేంజింగ్ రూంలో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. బాత్ రూంలో భోజనాలు పెట్టలేదని, ఆ రోజు వర్షం పడిందని, అందుకే స్విమ్మింగ్ పూల్ వద్ద భోజన ఏర్పాట్లు చేశామని తెలిపాడు. ప్రభుత్వం తీరుపై విమర్శలు తీవ్రతరం కావడంతో సహరాన్‌పూర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనిమేష్ సక్సేనాను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విచారణకు ఆదేశించి సంబంధిత వ్యక్తి మూడు రోజుల్లో నివేదిక అందజేస్తామని సహరాన్‌పూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ అఖిలేష్‌ సింగ్‌ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనపై ట్వీట్ చేసింది. బీజేపీ వివిధ ప్రచారాలకు కోట్లు ఖర్చు పెడుతుంది, కానీ ఆటగాళ్లకు సరైన ఏర్పాట్లు చేయడానికి డబ్బు లేదు’ అని హిందీలో ట్వీట్ చేసింది.

తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ట్వీట్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లో కబడ్డీ ఆటగాళ్లకు వడ్డించిన ఆహారాన్ని టాయిలెట్‌లో ఉంచారు. ఆటగాళ్లను బీజేపీ ఇలా గౌరవిస్తుంది? సిగ్గుచేటు! అని పేర్కొన్నాడు.