Nifty – Sensex : స్టాక్ మార్కెట్ లో ‘పండుగ’ జోష్

స్టాక్ మార్కెట్ లో పండుగ జోష్ నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట సూచీలు జోరు మీదున్నాయి.

10TV Telugu News

Stock Market Updates : స్టాక్ మార్కెట్ లో పండుగ జోష్ నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట సూచీలు జోరు మీదున్నాయి. 2021, అక్టోబర్ 14వ తేదీ గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే..పలు షేర్లు లాభాల బాట పయనించాయి. మార్కెట్ లో అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. మైండ్ ట్రీ, విప్రో, హింద్ జింక్, పర్సిస్టెంట్ సిస్టమ్, వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ షేర్లు ఫుల్ జోష్ లో ట్రేడవుతున్నాయి. కొన్ని షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Read More : Gold Price : పండుగ వేళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

సెన్సెక్స్ తొలిసారి 61వేల పాయింట్ల మార్కును, నిఫ్టీ 18 వేల 250 మార్కును దాటేశాయి. ప్రీ మార్కెట్ సెషన్ లో సెన్సెక్స్ 61 వేల 600 కూడా చేరింది. ఉదయం 9.26 గంటల సమయంలో సెన్సెక్స్ 360 పాయింట్లు పెరిగి…61 వేల 097 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి…18 వేల 271 వద్ద ట్రేడవుతున్నాయి.      ఇదిలా ఉంటే..21 కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటిల్లో హెచ్ సీఎల్ టెక్నాలజీస్, సైయింట్, డెన్ నెట్ వర్క్ ఉన్నాయి.

×