Stock Market : ఒమిక్రాన్ దెబ్బకు కుదేల్.. ఆ ఐదు మినహా.. మొత్తం నష్టాల్లోనే

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో 1,000 పాయింట్లకు పైగా క్షిణించింది. ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో పెట్టుబడి దారులు భయంతో అమ్మకాల బాటపట్ట

Stock Market : ఒమిక్రాన్ దెబ్బకు కుదేల్.. ఆ ఐదు మినహా.. మొత్తం నష్టాల్లోనే

Stock Market

Stock Market : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో 1,000 పాయింట్లకు పైగా క్షిణించింది. ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో పెట్టుబడి దారులు భయంతో అమ్మకాల బాటపట్టారు. దీంతో దిగ్గజ కంపెనీలు కూడా నష్టాల బాట పట్టాయి. ఇక నిరంతర విదేశీ నిధుల ప్రవాహం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది.

చదవండి : BSE Stock Markets : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 1028.61 పాయింట్లు క్షిణించి 55,983. 3, నిఫ్టీ 307.50 పాయింట్లు తగ్గి 16,677.70కి చేరింది. ఇక టాప్ లూజర్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ మొదటి స్థానంలో ఉంది. బజాజ్ ఫైనాన్స్ షేర్ ఒక్కసారే 4 శాతం డౌన్ అయింది. శుక్రవారం క్లోజ్ రూ.6901.10 గా ఉండగా.. సోమవారం 11 గంటల సమయంలో రూ.6610.10కి పడిపోయింది. ఇక బజాజ్ ఫైనాన్స్ తర్వాత హీరో మోటార్ 4 శాతం నష్టాన్ని చవిచూసింది.

చదవండి : Stock Market : మరో బ్లాక్ డే…స్టాక్ మార్కెట్లు భారీ పతనం, లక్షల కోట్ల సంపద ఆవిరి

ఉదయం 11 గంటల సమయంలో సిప్లా, పవర్ గ్రిడ్, డా. రెడ్డీస్, విప్రో, tcs కంపెనీలు మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పెన్నీ స్టాక్ కూడా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి.

చదవండి : Stock Markets: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు..!