Father Holds Umbrella : ఒకవైపు భారీ వర్షం.. మరోవైపు ఆన్‌లైన్ క్లాస్.. ఫోటో వైరల్

ఇక ఈ విషయంపై విద్యార్థిని స్థానిక మీడియాతో మాట్లాడారు.. తమ గ్రామంలో 20 మంది విద్యార్థులు ఉన్నారని.. గ్రామంలో సరిగా నెట్ వర్క్ లేకపోవడంతో గ్రామం వెలుపల వచ్చి క్లాసులు వింటున్నామని తెలిపారు. తాను బిఏ డిగ్రీ చేస్తున్నానని, వర్షంలో తడుస్తున్నానని తన తండ్రి గొడుగు పట్టుకొని నిల్చున్నట్లు వివరించింది.

Father Holds Umbrella : ఒకవైపు భారీ వర్షం.. మరోవైపు ఆన్‌లైన్ క్లాస్.. ఫోటో వైరల్

Father Holds Umbrella

Father Holds Umbrella : కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ వర్షంలో ఓ విద్యార్థి ఆన్ లైన్ క్లాసులు వింటుండగా తండ్రి పక్కన నిల్చొని గొడుగు పట్టుకున్నాడు. అటుగా వెళ్లేవారు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే దక్షిణ కన్నడ జిల్లా సుల్లియా తాలూకా బాలక్క గ్రామానికి చెందిన ఉదిత్ శ్యామ్ అనే విద్యార్థిని ఆన్ లైన్ క్లాసులు వినేందుకు గ్రామానికి సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశానికి వచ్చింది.

అయితే గత కొద్దీ రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ విద్యార్థిని వర్షంలో క్లాస్ వినాల్సి వచ్చింది. ఆమె పరిస్థితి అర్ధం చేసుకున్న తండ్రి కూతురు క్లాసులు వింటుండగా గొడుగు పట్టుకొని నిల్చున్నాడు. సుమారు రెండు గంటల పాటు ఆ తండ్రి తన కూతురు మీద నీరు పడకుండా గొడుగు పట్టుకున్నాడు. అటుగా వెళ్లేవారు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ఈ విషయంపై విద్యార్థిని స్థానిక మీడియాతో మాట్లాడారు.. తమ గ్రామంలో 20 మంది విద్యార్థులు ఉన్నారని.. గ్రామంలో సరిగా నెట్ వర్క్ లేకపోవడంతో గ్రామం వెలుపల వచ్చి క్లాసులు వింటున్నామని తెలిపారు. తాను బిఏ డిగ్రీ చేస్తున్నానని, వర్షంలో తడుస్తున్నానని తన తండ్రి గొడుగు పట్టుకొని నిల్చున్నట్లు వివరించింది.

ఆన్ లైన్ క్లాసులు మొదలైన నాటి నుంచి తాను ఇలా బయటకు వచ్చి వినాల్సి వస్తుందని తెలిపారు ఉదిత్.. ఉదయం 9 గంటలకు గ్రామ శివారు ప్రాంతాలకు వస్తే మళ్లీ తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వెళ్తామని తెలిపారు. మధ్యలో ఓ గంట పాటు లంచ్ టైం ఉంటుందని వివరించారు. తమ గ్రామానికి సరైన నెట్ వర్క్ వచ్చే విధంగా చూడాలని ఆమె అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు. తనలాంటి వారు చాలామంది ఇలా వర్షంలో ఆన్ లైన్ క్లాసులు వింటున్నారని వివరించారు.