Shraddha Walkar Murder Case : శ్రద్దా వాకర్ కేసులో మరో సంచలన నిజం.. మృతదేహం ముక్కలను సూరజ్‌ఖండ్‌లో పడేసిన అఫ్తాబ్?

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్దా వాకర్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అఫ్తాబ్ ముందు నుంచి చెబుతున్నట్లుగా శ్రద్ధ శరీర భాగాలను మెహ్రౌలీ అడవిలో పడేయలేదు. తన ప్లాట్ కు 15 కిలోమీటర్ల దూరంలోని..

Shraddha Walkar Murder Case : శ్రద్దా వాకర్ కేసులో మరో సంచలన నిజం.. మృతదేహం ముక్కలను సూరజ్‌ఖండ్‌లో పడేసిన అఫ్తాబ్?

Shraddha Walkar Murder Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్దా వాకర్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అఫ్తాబ్ ముందు నుంచి చెబుతున్నట్లుగా శ్రద్ధ శరీర భాగాలను మెహ్రౌలీ అడవిలో పడేయలేదు. తన ప్లాట్ కు 15 కిలోమీటర్ల దూరంలోని సూరజ్ ఖండ్(హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ సిటీ) లో పడేశాడు. ఆ ప్రాంతం నుంచి పోలీసులు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో ఉన్న సూరజ్ కుండ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మానవ శరీర భాగాలతో ఉన్న ఒక సూట్ కేసు లభించింది. సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యతో ఈ సూట్ కేసుకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఫరీదాబాద్ లోని సూరజ్ కుండ్ ప్రాంతంలో గురువారం పోలీసులకు ఈ సూట్ కేసు లభించింది. అందులో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శరీర భాగాలు, కొన్ని ఎముకలు ఉన్నాయి. లివిన్ పార్ట్ నర్ అఫ్తాబ్ చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ శరీర భాగాలుగా వాటిని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

శ్రద్ధ హత్య కేసులో అఫ్తాబ్ అరాచకాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అఫ్తాబ్.. శ్రద్ధను తిట్టడం, కొట్టడమే కాదు.. సిగరెట్ తో కూడా ఆమె శరీరాన్ని కాల్చేవాడు. శ్రద్ధ స్నేహితుడొకరు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. 8 గంటల పాటు జరిగిన పాలిగ్రాఫ్ టెస్ట్ లో అఫ్తాబ్ బాల్యం, స్నేహితులు, శ్రద్ధా వాకర్ తో సహజీవనంపై 50 ప్రశ్నలు వేశారు. శ్రద్దను చంపడానికి కారణాలు, సాక్ష్యాలు దాచింది ఎక్కడ? వంటి ప్రశ్నలు అడిగారు. హిందీలో అడిగిన ప్రశ్నలకు ఇంగ్లీష్ లో సమాధానం ఇచ్చాడు అఫ్తాబ్. శ్రద్దా వాకర్ తో డేటింగ్ మొదలైనప్పటి నుంచి మృతదేహాన్ని ముక్కలు చేసి పడేశాదాక ఏం జరిగిందో మొత్తం అఫ్తాబ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు ఫోరెన్సిక్ అధికారులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తాను దృశ్యం సినిమా పార్ట్ 1 చూశానని అఫ్తాబ్ చెప్పాడు. శ్రద్ధ డెడ్ బాడీని ముక్కలు చేసేందుకు అఫ్తాబ్ మొత్తం 5 కత్తులు ఉపయోగించినట్లు పోలీసులు చెప్పారు. అఫ్తాబ్ ప్లాట్ లో వాటన్నింటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ కేసులో ఆధారాల కోసం ఢిల్లీ పోలీసులు అణువణువూ శోధిస్తున్నారు. అఫ్తాబ్ నివాసం ఉన్న చాదర్ పూర్ ఏరియాలో మూడు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను ప్రత్యేక పోలీసు బృందం పరిశీలిస్తోంది. వందల గంటలున్న ఈ ఫుటేజీలో శ్రద్ధ శరీర భాగాలను అఫ్తాబ్ తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డ్ అయి ఉంటాయని భావిస్తున్నారు.

తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ ను అఫ్తాబ్ పూనావాలా మే 18న గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేశాడు. వాటిని ఒక్కొక్కటిగా దగ్గర్లోని అటవీ ప్రాంతంలో పడేశాడు. నవంబర్ 10న శ్రద్ధ కనిపించడం లేదంటూ అతడి తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టిన పోలీసులకు.. శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు గురైనట్లు గుర్తించి షాక్ అయ్యారు.

ఢిల్లీలో ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. కఠినమైన విచారణ తర్వాత అఫ్తాబ్ నిజాన్ని వెల్లడించడం ప్రారంభించాడు. అఫ్తాబ్‌కు చెందిన ఛతర్‌పూర్ ఫ్లాట్ నుంచి కీలకమైన సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. సాక్షులు లేనందున ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ డేటా, సందర్భోచిత సాక్ష్యాలు.. ఈ కేసులో కీలకం కానున్నాయి.