Sukesh Chandrasekhar : బీఆర్ఎస్ ఆఫీసులో అరుణ్ పిళ్లైకి రూ.15కోట్లు ఇచ్చా- మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్

Sukesh Chandrasekhar : బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన రేంజ్ రోవర్ పై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందన్నారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచన మేరకే..

Sukesh Chandrasekhar : బీఆర్ఎస్ ఆఫీసులో అరుణ్ పిళ్లైకి రూ.15కోట్లు ఇచ్చా- మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్

Sukesh Chandrasekhar : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేసిన సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖను సంధించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి రెండు పేజీల లేఖ రాసిన సుకేశ్ చంద్రశేఖర్.. బీఆర్ఎస్ కార్యాలయంలో అరుణ్ పిళ్లైకి డబ్బులు ఇచ్చానని ఆరోపించారు. ఈ వారంలో 703 పేజీల వాట్సాప్ చాట్ విడుదల టీజర్ విడుదల చేస్తానంటూ లేఖలో పేర్కొన్నారు.

మొదట విడుదల చేసే చాట్ లో తనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడికి మధ్య జరిగిన చాటింగ్ ఉంటుందన్నారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచన మేరకే బీఆర్ఎస్ కార్యాలయంలో రూ.15 కోట్లు ఇచ్చానని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన రేంజ్ రోవర్ పై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందంటూ లేఖలో పేర్కొన్నాడు.

Also Read..KTR: పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం : కేటీఆర్

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉంటున్న సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. రెండు పేజీల లేఖ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి రాశారు. త్వరలోనే ఒక టీజర్ విడుదల కాబోతోందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కేజ్రీవాల్, జైన్ తో తనకున్న సంబంధాలు, తనను వారు ఏ విధంగా వాడుకున్నారన్న అంశాలకు సంబంధించిన చాట్స్ అన్నింటిని బయటపెడతానన్నారు. కేజ్రీవాల్ నిజస్వరూపం బయటపెడతానన్నారు.(Sukesh Chandrasekhar)

Also Read..Sukesh Chandrasekhar : బీఆర్ఎస్‌ ఆఫీసులో రూ.75కోట్లు ఇచ్చా-సంచలనం రేపుతున్న సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ

అలాగే కేజ్రీవాల్, బీఆర్ఎస్ నేతలకున్న సంబంధాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులతో ఉన్న సంబంధాలు, అలాగే బీఆర్ఎస్ కార్యాలయంలో తాను గతంలో రూ.15కోట్లు ఇచ్చాను, రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి ఆ డబ్బు ఇచ్చానని ప్రస్తావించారు. ఏపీ అనే కోడ్ ను గతంలో సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తావించారు.

ఇప్పుడు ఆ పేరును అరుణ్ పిళ్లైగా.. ఈ లేఖలో బయటపెట్టాడు సుకేశ్ చంద్రశేఖర్. నల్ల రేంజ్ రోవర్ కారు(6060) అద్దానికి ఎమ్మెల్సీ స్టిక్కర్ కూడా ఉన్నట్లు చెప్పాడు. తాను బయటపెట్టబోయే మొదటి చాట్ లో బీఆర్ఎస్ నేత తనతో చేసిన చాటింగ్, అలాగే డబ్బు తనకు అందిందని, డబ్బు ఏ విధంగా అడిగారు, ఇలా అనేక అంశాలకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా బయటపెడతానని సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.

Also Read..Quthbullapur Constituency: కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉంది?

కేజ్రీవాల్ అసలు రంగు బయటపెడతానని సుకేశ్ చెప్పాడు. సౌత్ గ్రూప్ తో కేజ్రీవాల్ కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేది కూడా ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ద్వారా వెలుగులోకి వస్తాయని తన రెండు పేజీల లేఖలో సుకేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. బీఆర్ఎస్ కార్యాలయంలో పార్క్ చేసి ఉంచిన బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారులో రూ.15కోట్లు ఉంచానని గతంలోనే సుకేశ్ చంద్రశేఖర్ చెప్పడం జరిగింది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన లేఖలో ఏముందంటే..
” లేఖలో బీఆర్ఎస్ నేతలను ప్రస్తావించిన సుకేశ్. బీఆర్ఎస్ ఆఫీసులో రూ.15 కోట్లు ముట్టచెప్పినట్టు మరోసారి వెల్లడించిన సుకేశ్. 703 చాట్లలో మొదటి చాట్ సారాంశం వెల్లడించిన సుఖేష్ చంద్రశేఖర్. సౌత్ గ్రూప్ లోని అరుణ్ పిళ్ళైకి(AP) రూ.15 కోట్లు ఇచ్చాను. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లోపల పార్క్ చేసి ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న కారులో వీటిని అందజేశా. రేంజ్ రోవర్ 6060 అనే నెంబర్ ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ కారులో ఆ డబ్బు పెట్టా. డబ్బు తమకు అందిందని కన్ఫర్మేషన్ కూడా బీఆర్ఎస్ నేతలు ఇచ్చారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనలు మేరకే ఆ డబ్బును అందజేశా. ఆప్-బీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉంది”.(Sukesh Chandrasekhar)