Supreme Court: సుప్రీంలో నేటి బెంచ్ ఒక బెంచ్ మార్క్.. మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం

ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముగ్గురే మహిళా న్యాయమూర్తులున్నారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎమ్ త్రివేది, జస్టిస్ బీ వీ నాగరత్న అనే ఈ ముగ్గురూ 2021 ఆగస్ట్ 31న ప్రమాణం చేశారు. 2021లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండేవారు. 2021లో జస్టిస్ ఇందిరా బెనర్జీ కూడా ఉన్నారు. ఇందిరా బెనర్జీ ఈ ఏడాది అక్టోబర్‌లో రిటైరయ్యారు

Supreme Court: సుప్రీంలో నేటి బెంచ్ ఒక బెంచ్ మార్క్.. మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం

All women bench in Supreme Court today for the third time in history

Supreme Court: సుప్రీం కోర్టులోని నెంబర్ 11లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈరోజు ఏర్పాటైన ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటే వారిద్దరూ మహిళలే కావడం గమనార్హం. వాస్తవానికి సుప్రీం కోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. కాగా, నేటి ధర్మాసనంలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు హాజరయ్యారు. సుప్రీం కోర్టు చరిత్రలో ఇలా జరగడం తొలిసారి కాకపోయినప్పటికీ.. ఇది కేవలం మూడోసారి మాత్రమే కావడం గమనార్హం.

Maha vs Karnataka: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో హై-టెన్షన్.. మహా నుంచి కాదు, కన్నడ నుంచి పంపాలంటూ ఆందోళన

గురువారం ఉదయం 10:30 గంటలకు కోర్ట్ నెంబర్ 11లో ఉదయం పదిన్నరకు ధర్మాసనం పిటిషన్లను విచారించడం ప్రారంభించింది. మొత్తం 32 పిటిషన్లలో 10 బదిలీ పిటిషన్లు కాగా, మరో 10 బెయిల్‌కు సంబంధించిన పిటిషన్లు ఉన్నాయి. 2013లో కూడా ఇలాగే జస్టిస్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. అయితే ఆ సమయంలో అది అనుకోకుండా జరిగింది. న్యాయమూర్తి జస్టిస్ అఫ్తాబ్ ఆలం ఆరోజు గైర్హాజరు కావడంతో కేవలం మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పడింది. ఇక 2018లో సైతం ఇలాగే జరిగింది. జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది.

SC-ST Act: దళిత విద్యార్థులతో బలవంతంగా టాయిలెట్లు కడిగించిన ప్రిన్సిపాల్

ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముగ్గురే మహిళా న్యాయమూర్తులున్నారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎమ్ త్రివేది, జస్టిస్ బీ వీ నాగరత్న అనే ఈ ముగ్గురూ 2021 ఆగస్ట్ 31న ప్రమాణం చేశారు. 2021లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండేవారు. 2021లో జస్టిస్ ఇందిరా బెనర్జీ కూడా ఉన్నారు. ఇందిరా బెనర్జీ ఈ ఏడాది అక్టోబర్‌లో రిటైరయ్యారు. కాగా, బుధవారం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎమ్ త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, జస్టిస్ బీ వీ నాగరత్న 2027లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Gujarat Polls: దేశంలోనే అతిపెద్ద ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ప్రధాని మోదీ