House tax notices for Taj Mahal : తాజ్‌మహల్‌కు పన్ను నోటీసులు..రూ.1.కోటి చెల్లించాలని, లేకుంటే జప్తు చేస్తామని ఆదేశం

ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడం తాజ్ మహల్. అటువంటి తాజ్ మహల్ కు ఇంటిపన్ను,నీటి పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్. రూ. 1.9 కోట్ల నీటి పన్ను, రూ. 1.5 లక్షల ఆస్తి పన్నుబిల్లు కట్టాలి అంటూ ఆగ్రా మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు

House tax notices for Taj Mahal : తాజ్‌మహల్‌కు పన్ను నోటీసులు..రూ.1.కోటి చెల్లించాలని, లేకుంటే జప్తు చేస్తామని ఆదేశం

House tax notices for Taj Mahal

 

House tax notices for Taj Mahal : ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడం తాజ్ మహల్. అది సమాధి అని కొంతమంది అంటారు. కాదు ప్రేమకు చిహ్నం అంటారు. ఏది ఏమైనా తాజ్ మహల్ ఇల్లు అయితే కాదు. కానీ తాజ్ మహల్ కు ఇంటిపన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ రూ. 1.9 కోట్ల నీటి పన్ను, రూ. 1.5 లక్షల ఆస్తి పన్నుబిల్లు కట్టాలి అంటూ ఆగ్రా మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ బకాయిలు 15 రోజుల్లో కట్టేయాలంటూ హుకుం జారీ చేసింది. అంతేకాదు ఈ బకాయిలు నిర్ణీత గడువులోగా కట్టకపోతే తాజ్ మహల్ ను అటాచ్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు మున్సిపల్ అధికారులు.

మున్సిపల్ అధికారులు జారీ చేసిన ఈ నోటీసులు చూసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు షాక్ అయ్యారు. ఆశ్చర్యపోయారు. తాజ్ మహల్ ఓ కళాత్మక చారిత్రాత్మక కట్టడం దానికి ఇంటిపన్ను ఏంటీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటువంటి నోటీసులు రావటం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

ఈ వ్యవహారంపై ఏఎస్‌ఐ సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ పటేల్‌ మాట్లాడుతూ.. తాజ్ మహల్ కు రెండు నోటీసులు వచ్చాయని ఒకటి నీటిపన్ను, రెండు ఆస్తిపన్ను గురించి వచ్చాయని తెలిపారు. మొత్తం రూ.1.9 కోట్ల నీటిపన్ను,రూ.1.5లక్షల ఆస్తిపన్ను కట్టాలని నోటీసుల్లో ఉందని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో కార్పొరేషన్‌ అధికారుల పొరపాటు పడ్డారని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలోగానీ దేశంలో ఎక్కడా గానీ ఎటువంటి స్మారక చిహ్నాలకు పన్ను విధించటం జరగదని ఇది అధికారుల పొరపాటు వల్ల జరిగింది అంటూ తెలిపారు. ఈ నోటీసుల గురించి మాట్లాడటానికి మున్సిపల్ అధికారులు వెనుకాడుతున్నారు.