Goondas Act : రెమిడెసివిర్, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై గూండా యాక్ట్.. ప్రభుత్వం వార్నింగ్

కరోనా కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వ్యక్తులపై గూండా యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్ లో

Goondas Act : రెమిడెసివిర్, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై గూండా యాక్ట్.. ప్రభుత్వం వార్నింగ్

Goondas Act

Goondas Act : కరోనా కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వ్యక్తులపై గూండా యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్ లో రెమిడెసివిర్ ఇంజెక్షన్ కు, ఆక్సిజన్ సిలిండర్లకు భారీగా డిమాండ్ ఉంది. దీంతో కొందరు కేటుగాళ్లు దీన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. వాటిని దాచి ఉంచుతున్నారు. ఆ తర్వాత బ్లాక్ మార్కెట్ కు తరలించి పెద్ద మొత్తానికి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్ కు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కేంద్రాల ముందు సిలిండర్లు, ఇంజెక్షన్ల కోసం వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు. వారంతా ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి తీసుకొచ్చిన ప్రిస్ స్క్రిప్షన్లు చూపిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ”కొందరు కేటుగాళ్లు రెమిడెసివిర్ ను దాచి ఉంచుతున్నారు. బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. అది చాలా పెద్ద నేరం” అని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.

తమిళనాడు రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఉంది. ఫ్రెష్ స్టాక్స్ కోసం రాష్ట్రం వెయిట్ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉండటంతో.. ఆసుపత్రి యాజమాన్యాలు ఆ మందులు తీసుకురావాలని రోగుల బంధువులకు చెబుతున్నాయి. వారంతా రోడ్ల మీద పడి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం కిల్ పాక్ మెడికల్ కాలేజీలో రెండు ఔట్ లెట్లు ప్రారంభించి మందులు విక్రయిస్తోంది. జనాల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం మరికొన్ని ఔట్ లెట్లు ఓపెన్ చేసింది. సేలం, ట్రిచి, మధురైలలో కౌంటర్లు ఓపెన్ చేసింది. జనాల సంఖ్య విపరీతంగా పెరగడంతో కిల్ పాక్ మెడికల్ కాలేజీలోని కౌంటర్లను జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలోకి మార్చింది ప్రభుత్వం. స్టేడియంలోనూ అదే పరిస్థితి. మందుల కోసం జనాలు భారీగా తరలిచ్చారు. మరిన్ని ఔట్ లెట్లు అందుబాటులోకి తీసుకొచ్చి రోజుకు 20వేల వయల్స్ విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

కాగా, బంగ్లాదేశ్ లో స్మగ్లింగ్ చేసి చెన్నైలో రెమిడెసివిర్ అమ్ముతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఫార్మా కంపెనీ సాయంతో ఆ ముఠా ఈ పని చేస్తోంది. వారి నుంచి పోలీసులు 205 వయల్స్ స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఒక్క కరోనా రోగికి 6 వయల్స్ అవసరం అవుతాయి. వాటి ధర రూ.9వేలు.

కరోనా కష్టకాలంలో చిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు ఆక్సిజన్ కొరత మరో పెద్ద సవాల్. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు సరిపడ ఆక్సిజన్ సిలిండర్లు అందుతున్నాయి. అయితే చిన్న చిన్న ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. డిమాండ్ భారీగా ఉండటంతో సిలిండర్లు సరిపోవడం లేదు.