Accidental Death: మట్టిలో కూరుకుపోయిన పారిశుధ్య కార్మికుడు: రక్షించే క్రమంలో తల తెగిపడి మృతి

డ్రైనేజి కాలువను శుభ్రపరిచేందుకు గోతిలో దిగిన పారిశుధ్య కార్మికుడొకరు మట్టిలో కూరుకుపోగా..రక్షించే క్రమంలో అతని తల తెగిపడి మృతి చెందాడు.

Accidental Death: మట్టిలో కూరుకుపోయిన పారిశుధ్య కార్మికుడు: రక్షించే క్రమంలో తల తెగిపడి మృతి

Tamilnadu

Accidental Death: తమిళనాడులోని మధురై నగరంలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. డ్రైనేజి కాలువను శుభ్రపరిచేందుకు గోతిలో దిగిన పారిశుధ్య కార్మికుడొకరు మట్టిలో కూరుకుపోగా..రక్షించే క్రమంలో అతని తల తెగిపడి మృతి చెందాడు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఈరోడ్ జిల్లాకు చెందిన సతీష్ అలియాస్ వీరన్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విలంగుడి వద్ద 11 అడుగుల లోతైన డ్రైనేజి లైన్ ను శుభ్రపరిచేందుకు దిగాడు. వీరన్ గోతిలో ఉండగానే ప్రమాదవశాత్తు మట్టిపెళలు జారిపడ్డాయి. దీంతో వీరన్ శిథిలాల కిందనే చిక్కుకుపోయాడు. అయితే ప్రమాదాన్ని గమనించిన తోటి కార్మికులు, స్థానిక అధికారులు అగ్నిమాపక సిబ్బంది లేదా రెస్క్యూ టీమ్‌ను పిలవడానికి బదులుగా JCBతో శిథిలాలను తొలగించడం ప్రారంభించారు.

Other Stories: Drunken Rooster: మ‌ందు లేనిదే ముద్ద ముట్ట‌దు.. కోడిపుంజు విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌..!

ఈక్రమంలో శిథిలాల లోతును అంచనా వేయలేని జేసీబీ డ్రైవర్..వీరన్ పై నుంచి మట్టి తొలగించగా.. అతని తల మొండెం నుంచి వేరయింది. ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని తాళ్ల ద్వారా బయటకు తీశారు. అదే సమయంలో సైట్ ఇంజనీర్ సికిందర్, సైట్ సూపర్‌వైజర్ బాలు, జేసీబీ ఆపరేటర్ సురేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరి నిర్లక్ష్యం కారణంగానే పారిశుధ్య కార్మికుడు మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. వీరన్ మృతి గురించి తెలుసుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్.. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం అందించారు.