Serum Institute : కోవిషీల్డ్ ఉత్పత్తి పెంచాం..లక్ష్యాన్ని సాధించాం

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచినట్లు సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది.

Serum Institute : కోవిషీల్డ్ ఉత్పత్తి పెంచాం..లక్ష్యాన్ని సాధించాం

Poonawala

Serum Institute కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచినట్లు సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది. దేశంలో కోవిడ్ థర్డ్ ని అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్ ని వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్న సమయంలో వ్యాక్సిన్ల కొరతతో దేశం ఇబ్బందులు పడుతుందని…అయితే వ్యాక్సిన్ల కొరత తీర్చేందుకు తాము ప్రొడ‌క్ష‌న్ వేగాన్ని పెంచిన‌ట్లు ఇవాళ ఆ సంస్థ ప్ర‌క‌టించింది. జులై నాటికి 110 మిలియన్(11 కోట్లు)వ్యాక్సిన్ డోసులను ఉత్ప‌త్తి చేస్తామ‌న్న టార్గెట్‌ ను అందుకున్న‌ట్లు ఓ మీడియా సంస్థ‌తో సీరం ఇనిస్టిట్యూట్ వెల్ల‌డించింది. ఇక, సెప్టెంబర్ నుంచి రష్యా కరోనా టీకా స్పుత్నిక్‌-వీ ఉత్పత్తిని సీరం సంస్థ ప్రారంభిస్తుందని సీరం ఇన్‌స్టిట్యూట్, రష్యా ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) తాజాగా ప్రకటించాయి

మరోవైపు దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్ టీకాల కొర‌త ఉన్న విష‌యం తెలిసిందే. స్టాక్‌లు లేక‌పోవ‌డం వ‌ల్ల ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను కూడా మూసివేశారు. దేశవ్యాప్తంగా జూన్ 21 నుండి సగటు రోజువారీ టీకాల తగ్గుదల ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కోవిన్ పోర్ట‌ల్ ప్ర‌కారం.. జూన్ 21 నుంచి జూన్ 27వ తేదీన మ‌ధ్య దేశంలో స‌గ‌టున రోజూ 61.14 ల‌క్ష‌ల డోసుల టీకాల‌ను ఇచ్చారు. జూలై 28 నుంచి జూలై 4 వ‌ర‌కు 41.92 ల‌క్ష‌ల డోసులను, జూలై 5 నుంచి జులై 11 వ‌ర‌కు 34.32 ల‌క్ష‌ల డోసులను ప్రజలకు అందించారు.