Tea Seller Cryptocurrency : పోలా అదిరిపోలా.. ఇచ్చట క్రిప్టో కరెన్సీ స్వీకరించబడును.. చాయ్ వాలా క్రియేటివిటీ అదుర్స్

రోడ్డు పక్కన టీ అమ్ముకునే ఓ చాయ్ వాలా.. 'ఇక్కడ క్రిప్టో కరెన్సీ స్వీకరించబడును' అని తన టీ స్టాల్ ముందు ఓ బోర్డు పెట్టుకున్నాడు. ఆ ఫోటోను వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేస్తూ ద న్యూ ఇండియా అని క్యాప్షన్ పెట్టారు. అంతే, ఆయన ట్వీట్ వైరల్ అయిపోయింది. ఆ చాయ్ వాలా కూడా ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయాడు.

Tea Seller Cryptocurrency : పోలా అదిరిపోలా.. ఇచ్చట క్రిప్టో కరెన్సీ స్వీకరించబడును.. చాయ్ వాలా క్రియేటివిటీ అదుర్స్

Tea Seller Cryptocurrency : వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా డిఫరెంట్ గా కనిపిస్తే చాలు వెంటనే ఆయన ట్వీట్ చేసేస్తారు. దాని గురించి నెటిజన్లకు పరిచయం చేస్తారు. అలా ఆయన చేసిన ట్వీట్లు ఎన్నో వైరల్ అయ్యాయి. ఆయన చేసే ట్వీట్లన్నీ చాలా ఇంట్రస్టింగ్ గానూ ఉంటాయి. కొన్ని ఔరా అనిపిస్తే, మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇంకొన్ని చాలా సరదాగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన షేర్ చేసిన ఓ చాయ్ వాలా ఫోటో నెటిజన్లను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏం నడుస్తోంది అంటే.. క్రిప్టో కరెన్సీ గురించి బాగా చర్చ జరుగుతోందని చెప్పొచ్చు. అయితే, క్రిప్టో కరెన్సీని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అదో టఫ్ కాన్సెప్ట్. పెద్ద పెద్ద చదువులు చదివిన వారికే క్రిప్టో కరెన్సీ అంటే పూర్తిగా అవగాహన లేదు. అలాంటిది.. రోడ్డు పక్కన టీ అమ్ముకునే ఓ చాయ్ వాలా.. ‘ఇక్కడ క్రిప్టో కరెన్సీ స్వీకరించబడును’ అని తన టీ స్టాల్ ముందు ఓ బోర్డు పెట్టుకున్నాడు. ఆ ఫోటోను వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేస్తూ ద న్యూ ఇండియా అని క్యాప్షన్ పెట్టారు. అంతే, ఆయన ట్వీట్ వైరల్ అయిపోయింది. ఆ చాయ్ వాలా కూడా ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయాడు.

Also Read..Viral Video: సముద్రంలో కెమెరాను మింగి.. మళ్ళీ బయటకు వదిలిన టైగర్ షార్క్ చేప

ఇక్కడ క్రిప్టో కరెన్సీ స్వీకరించబడును అనే బోర్డు అందరినీ బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఆ చాయ్ వాలా పెట్టిన మరో బోర్డు కూడా అందరినీ ఆకర్షిస్తోంది. అందులో అతడు చాయ్ ధరను చాక్ పీస్ తో రాశాడు. ఒకటి మన దేశపు కరెన్సీలో ధర ఉండగా, మరొకటి డాలర్ రూపంలో ఉంది. దీంతో ఆ బోర్డు కూడా బాగా హైలైట్ అయ్యింది.

వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్వీట్ కు చాయ్ వాలా రిప్లయ్ కూడా ఇచ్చాడు. తన టీ స్టాల్ గురించి ప్రస్తావించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాదు.. న్యూ ఇండియా కోసం తన చిన్న షాప్ తో తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నాడు.

 

ఇకపోతే.. రోడ్డు పక్కన చాయ్ అమ్ముకుంటున్నాడు కదా.. అని ఆ వ్యక్తిని చీప్ గా చూడొద్దు. ఎందుకంటే.. అతడు బాగానే చదువుకున్నాడు. బీసీఏ డ్రాపౌట్ స్టూడెంట్. పేరు శుభమ్ సైనీ. తన చాయ్ డబ్బా వెనకాలే ఓ పోస్టర్ అంటించుకున్నాడు. అందులో ఫ్రస్టేటేడ్ డ్రాపౌట్ అని రాసుంటుంది.

Also Read..Viral Video: హృదయాన్ని కదిలించే వీడియో.. కూతురు ప్రేమకు కన్నీరు పెట్టుకున్న తండ్రి.. చిన్నారి చర్యకు నెటిజన్లు ఫిదా..

చాయ్ అమ్ముకునే వ్యక్తి క్రియేటివిటీకి నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు. తన బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవడానికి అతడు చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచన చేస్తున్నాడని, ఈ ప్రయత్నంలో అతడు సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.