Arthur Road Jail: తోటి ఖైదీని రేప్ చేసిన యువకుడు.. బాధితుడు కూడా అత్యాచార నిందితుడే!

అది ముంబైలోని ఆర్థర్ రోడ్ లోని ఓ జైలు. అందులో అత్యాచార నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ కొన్నాళ్ళుగా తనను తోటి ఖైదీ లైంగికంగా వేధిస్తున్నాడని, తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని జైలు సిబ్బందికి ఫిర్యాదు చేస్తున్నాడు.

Arthur Road Jail: తోటి ఖైదీని రేప్ చేసిన యువకుడు.. బాధితుడు కూడా అత్యాచార నిందితుడే!

Arthur Road Jail

Arthur Road Jail: అది ముంబైలోని ఆర్థర్ రోడ్ లోని ఓ జైలు. అందులో అత్యాచార నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ కొన్నాళ్ళుగా తనను తోటి ఖైదీ లైంగికంగా వేధిస్తున్నాడని, తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని జైలు సిబ్బందికి ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ.. జైలు సిబ్బంది ఆ ఖైదీ ఫిర్యాదును ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆ ఖైదీ ఏకంగా జైలు అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. స్పందించిన అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించి ఖైదీ ఫిర్యాదు చేసినా పట్టించుకోని జైలు సిబ్బంది, పోలీసులకు నోటీసులు ఇచ్చారు.

Sexual Assault: సినీ నటిపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్

ఖైదీపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు కూడా రేప్ కేసులో నిందితుడిగానే శిక్ష అనుభవిస్తుండగా.. బాధితుడు కూడా రేప్ కేస్ లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఇద్దరూ అత్యాచార కేసులో నిందితులు కావడంతో ఒకే బ్యారక్ లో గత కొద్దీ నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో 19 ఏళ్ల యువకుడు.. 20 ఏళ్ల యువకుడిని గత కొద్దినెలలగా బెదిరించి, హింసించి అసహజంగా తన లైంగిక కోరిక తీర్చుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు.

Sexual Assault : ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళపై లైంగిక దాడి చేసిన ఎస్సై

తోటి ఖైదీని దారుణంగా కొడుతూ అత్యాచారానికి పాల్పడిన టీనేజర్ పై ఐపీసీ 377 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. అసహజ రీతిలో మనుషులు, పశువులపై ఇలా లైంగిక దాడికి పాల్పడిన వారిపై ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారని.. తోటి ఖైదీపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఈ యువకుడిపై కూడా అదే సెక్షన్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు అధికారులు మీడియాకి తెలిపారు.