Two-Headed Calf : రెండు తలల దూడకు జన్మనిచ్చిన గేదె

రాజస్థాన్ లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గేదె.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. రెండు తలలు, రెండు మెడలు, రెండు చెవులతో పుట్టిన అరుదైన దూడను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.

Two-Headed Calf : రెండు తలల దూడకు జన్మనిచ్చిన గేదె

Calf

Strange incident in Rajasthan : రాజస్థాన్ లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గేదె.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం ఉన్న అరుదైన దూడను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.

ధోల్పూర్ జిల్లాలోని పుర శిక్రౌడ గ్రామంలో ఆగస్టు 30న ఒక గేదె వింత దూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు తలలు, రెండు మెడలు, చెరో తలకు ముక్కు, రెండేసి కళ్లు, చెవులు ఉన్నాయి. ఈ దూడ ఆరోగ్యంగానే ఉందని యజమాని పేర్కొన్నారు. రెండు నోళ్లతో పాలు, నీరు తాగుతుందని తెలిపారు.

పశువైద్యుల అవసరం లేకుండానే సోమవారం ఆ గేదె రెండు తలల దూడకు జన్మనిచ్చిందని పశువైద్యుడు గుడ్డే సింగ్ తెలిపారు. జన్యుపరమైన లోపాల వల్ల రెండు తలలతో పుట్టిన దూడ సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణంగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

మరోవైపు ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రెండు తలలతో పుట్టిన దూడను చూసి ఆశ్చర్యపోతున్నారు.