Durand Cup: పొటోలో పడాలి తప్పుకోండి..! ఫొటోకోసం క్రీడాకారులనే పక్కకు నెట్టేసిన అతిథులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఆదివారం జరిగిన డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో సునీల్ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఎఫ్‌సి 2-1తో ముంబై సిటీ ఎఫ్‌సిని ఓడించి విజేతగా నిలిచింది. అయితే, బహుమతులు అందించే క్రమంలో ముఖ్యఅతిథులు క్రీడాకారుల పట్ల ప్రదర్శించిన ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Durand Cup: పొటోలో పడాలి తప్పుకోండి..! ఫొటోకోసం క్రీడాకారులనే పక్కకు నెట్టేసిన అతిథులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

Durand Cup

Durand Cup: క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోపీలు, బహుమతులు ఇచ్చేందుకు ముఖ్యఅతిథులు వస్తారు. వారు విజేతలుగా నిలిచిన జట్టుకు, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకనబర్చిన క్రీడాకారులకు బహుమతు ఇచ్చి, అభినందించి వెళ్లడం మనంచూస్తుంటాం. తాజాగా, నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియోలో.. ముఖ్యఅతిథులు విజేతగా నిలిచిన జట్టు సభ్యుడికి ట్రోపీని అందిస్తూనే.. ఫొటోకోసం వారినే పక్కకు నెట్టినట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు సదరు ముఖ్యఅతిథులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Team India New Jersey: టీ20 వరల్డ్‌కప్‌కోసం టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది..

కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఆదివారం జరిగిన డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో సునీల్ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఎఫ్‌సి 2-1తో ముంబై సిటీ ఎఫ్‌సిని ఓడించి విజేతగా నిలిచింది. థ్రిల్లింగ్‌గా సాగిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే బహుమతులు అందించే క్రమంలో ముఖ్య అతిథులు క్రీడాకారుల పట్ల ప్రదర్శించిన ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గణేశన్ మ్యాచ్ అనంతరం జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించేందుకు ముఖ్యఅతిథిగా వచ్చారు. అయితే ట్రోపీ విజేత జట్టు క్రీడాకారుడు సునీల్ ఛేత్రీకి కప్ ను అందించే క్రమంలో ఫోటో కోసం గవర్నర్ సునీల్ ఛెత్రీనే పక్కకు నెట్టడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మరో వీడియోలో ఫైనల్ మ్యాచ్‌లో ప్రతిభను కనబర్చిన క్రీడాకారుడు శివశక్తి నారాయణన్‌‌ను బహుమతి అందుకుంటున్న క్రమంలో మరో ముఖ్యఅతిథికూడా ఫొటోకోసం పక్కకు నెట్టడం వీడియోలో చూడొచ్చు. ఈ రెండు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు ముఖ్యఅతిథులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశపు అగ్రశ్రేణి ఫుట్‌బాల్ ఆటగాళ్ల పట్ల ముఖ్యఅతిథులు ఇలా అవమానకరంగా ప్రవర్తించడం సరికాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరో నెటిజన్.. రాజకీయ నాయకులు భారతదేశంలోని రియల్, యంగ్ టాలెంట్ ముందు నిలబడాలని కోరుకుంటున్నారంటూ వ్యంగ్యంగా రాశాడు. మరో నెటిజన్.. ఈ రాజకీయ నాయకులు తమ గురించి ఏమనుకుంటున్నారో .. అంటూ రాశాడు.