UP Assembly Elections : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోరు.. ఒంటరిగా పోటీ చేయనున్న ప్రధాన పార్టీలు

యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రధాన పార్టీలన్ని పొత్తులతో పని లేకుండా సొంతంగా బరిలో దిగనుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

UP Assembly Elections : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోరు.. ఒంటరిగా పోటీ చేయనున్న ప్రధాన పార్టీలు

Uttar Pradesh (1)

major parties will contest alone : యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.. ప్రధాన పార్టీలన్ని పొత్తులతో పని లేకుండా సొంతంగా బరిలో దిగనుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.. ఎస్పీ, బీఎస్పీతో పొత్తు లేదని .. మొత్తం అన్ని స్థానాల్లో సొంతంగా పనిచేస్తామని ఇప్పటికే ప్రియాంక గాంధీ క్లారిటీ ఇచ్చారు.. మరోవైపు అధికార బీజేపీ పార్టీ చిన్న పార్టీలను కలుపుకొని బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది.. తాము ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయవతి ప్రకటించారు.. ఇక ప్రతిపక్ష సమాజ్‌వాద్‌ పార్టీ ఎస్బీఎస్పీతో కలిసి బరిలోకి దిగనుంది.. ఇక ముస్లిం ఒట్లే లక్ష్యంగా మెజారిటీ స్థానాల్లో ఎంఐఎం కూడా పోటీకి దిగుతుంది.. అయితే విపక్షాలన్ని ఒంటరిగా బరిలోకి దిగడం బీజేపీకి కలిసి వచ్చే అవకాశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రధాన పార్టీల ఒంటరి పోరుతో యూపీ ప్రజల ఓట్లు చీలడం ఖాయంగా కనిపిస్తోంది.. అయితే ఒంటరి పోరుపై ఎవరి కారణాలు వారు చెబుతున్నారు.. వరుస ఓటములతో రోజురోజుకు పార్టి ప్రతిష్ట మసకబారుతున్న సమయంలో.. ప్రియాంకా గాంధీ తీసుకున్న నిర్ణయం ఓ సంచలనమే గాక సాహసమనే చెప్పాలి.. తాము ఏ పార్టీతో కలవమని, ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా తమకుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ ఒక్క ప్రకటనతో పలు పార్టీలతో పొత్తుతో యూపీ ఎన్నికల బరిలో హస్తం పార్టీ బరిలోకి దిగుతుందన్న ఊహాగానాలకు చెక్‌ పెట్టారు ప్రియాంక..

Raging : వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

గత ఎన్నికల్లో ఎస్పీతో కలిసి కాంగ్రెస్‌ పోటీలో దిగింది. ఆ ఎలక్షన్స్‌లో సమాజ్‌వాదీ పార్టీకి 47, కాంగ్రెస్‌కు కేవలం 7 సీట్లు మాత్రమే దక్కాయి. ఇటీవల ప్రియాంక ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ను కలిశారు. విమాన ప్రయాణంలో ఒకరికొకరు ఎదురుపడటంతో ఇద్దరూ కాసేపు రాజకీయాలపై చర్చించుకున్నారు. దీంతో యూపీలో కాంగ్రెస్‌-ఎస్పీ మరోసారి ఉమ్మడిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది.. వీటన్నింటికి ఒక్క మాటతో చెక్‌ పెట్టారు ప్రియాంక.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలుపుతామని ప్రియాంక ప్రకటించారు. ఒంటరిగానే పోటీ చేస్తామని కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నానన్నారు..

ఒంటరిగా పోటీ చేస్తేనే మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందన్నారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.. అయితే ఏ పార్టీతోనైతే పొత్తు పెట్టుకుంటున్నామో ఆ పార్టీ వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు తోడై… తక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందన్న కోణంలోనే ప్రియాంక గాంధీ ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదనే ప్రియాంక ప్రకటనతో యూపీ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

PM Modi : భోపాల్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

2017లో ఉన్నావ్‌ అత్యాచార ఘటన సమయంలోనూ, 2020లో దేశాన్నే కుదిపేసిన హాత్రాస్‌ సామూహిక అత్యాచార, హత్య ఘటన సమయంలో…. సమాజ్‌వాదీ పార్టీ , బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ నేతలు కనిపించనే లేదని ప్రియాంక విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ప్రజల తరఫున పోరాడిందన్నారు. యూపీ కాంగ్రెస్‌లో ఇప్పటికే అన్ని తానై వ్యవహరిస్తున్నారు ప్రియాంక.. మరోవైపు కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ప్రియాంక బరిలో నిలుస్తారని, ఆమె నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ ఇటీవలె ప్రకటించారు..