Monkey : అధికారులకు పట్టించాడని పగబట్టిన కోతి

కర్ణాటకలో కోతి వ్యక్తిపై పగ పట్టింది. అధికారులకు పట్టించాడనే కారణంతో ఆ వ్యక్తిపై కోపం పెంచుకుంది. 22 కిలోమీటర్ల దూరంలోని అడవిలో విడిచిపెట్టినప్పటికీ, మళ్లీ అదే గ్రామానికి వచ్చింది.

Monkey : అధికారులకు పట్టించాడని పగబట్టిన కోతి

Monkey Attack

monkey retaliated man : కర్ణాటకలో ఓ కోతి వ్యక్తిపై పగ పట్టింది. అధికారులకు పట్టించాడనే కారణంతో ఆ వ్యక్తిపై కోపం పెంచుకుంది. 22 కిలోమీటర్ల దూరంలోని అడవిలో విడిచిపెట్టినప్పటికీ, లారీలో మళ్లీ అదే గ్రామానికి వెళ్లిన కోతి.. సదరు వ్యక్తి కోసం గంటలపాటు వెతుకులాడింది. వివరాళ్లోకి వెళ్తే.. చిక్కమగలూర్‌ జిల్లాలోని కొట్టిఘెహరా గ్రామంలో ఐదేళ్ల వయసున్న మగ కోతి స్థానికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేది. ఇళ్ల మీద ఉన్న పెంకులను పడేయడం, పండ్లు, ఆహారాన్ని ఎత్తుకెళ్లేది. బట్టలు, పర్సులను దొంగిలిస్తూ ఉండేది. అయితే గ్రామస్థులు సర్దుకుపోయేవారు.

ఇటీవల పాఠశాలలు తెరిచారు. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నప్పుడు ఆ కోతి వారిపై దాడులకు పాల్పడుతుండటంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కోతిని పట్టుకోవడానికి సెప్టెంబర్‌ 16న గ్రామానికి వచ్చిన అధికారులకు కోతిని పట్టుకోవడం కష్టతరమైంది. దీంతో అదే గ్రామానికి చెందిన జగదీశ్‌ అనే ఆటో డ్రైవర్‌.. కోతిని పట్టుకోవడానికి అధికారులకు సాయం చేశాడు. దీంతో ఎట్టకేలకు ఆ కోతిని అధికారులు పట్టుకున్నారు.

Corona Epidemic: కొవిడ్‌కు ముందు పరిస్థితులు రావాలంటే.. 8వారాలు కీలకం

తనను పట్టించిన జగదీశ్‌పై కోపం పెంచుకున్న ఆ కోతి.. అప్పటికప్పుడు అధికారుల నుంచి తప్పించుకొని జగదీశ్‌ వెంట పడింది. భయపడిపోయిన అతను ఆటోలో దాక్కున్నాడు. అది గమనించిన కోతి.. ఆటో టాప్‌, సీట్లను చించి వేసి.. జగదీశ్‌పై దాడి చేసి, చెవులను కొరికింది. శరీరాన్ని గాయపర్చింది. అప్రమత్తమైన వెంటనే అధికారులు ఆ కోతిని పట్టుకొని ఊరికి 22 కి.మీ దూరంలోని అడవిలో వదిలేసి వచ్చారు. దీంతో జగదీశ్‌తో పాటు గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.

కాగా తనను అధికారులకు పట్టించిన జగదీశ్‌పై పగ చల్లారని కోతి.. ఓ లారీ మీద ఎక్కి బుధవారం మళ్లీ అదే గ్రామానికి వెళ్లింది. జగదీశ్‌ జాడ కోసం ఇంటింటికీ తిరిగింది. కోతి చెవిపై ఉన్న గుర్తును గమనించిన గ్రామస్థులు ఆ కోతి.. మునుపటిదేనని గుర్తించారు. ఊరిలోకి కోతి వచ్చిన విషయాన్ని జగదీశ్‌కు చెప్పారు. దీంతో భయపడిపోయిన అతను.. కోతికి కనబడకుండా తలదాచుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు కోతిని బంధించి తీసుకెళ్లారు. అయితే ఆ కోతి మళ్లీ వస్తుందనే భయంతో జగదీశ్‌ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.