Omicron India : దేశంలో 5,488కు చేరిన ఒమిక్రాన్ కేసులు

మహారాష్ట్రలో కొత్తగా 46723 కేసులు నమోదవ్వగా, 32 మంది మరణించారు. ఢిల్లీలో కొత్తగా 27561 కేసులు నమోదవ్వగా, 40 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22155 కేసులు నమోదు అయ్యాయి.

Omicron India : దేశంలో 5,488కు చేరిన ఒమిక్రాన్ కేసులు

Omicron (2)

Omicron cases in india : ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలవరం రేపుతోంది. దేశంలో భారీగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరుకుంది. 2వేల 162 మంది వేరియంట్ బారి నుంచి కోలుకున్నారు. దేశంలో 27 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. దేశంలోకెళ్ల మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కొత్తగా 46, 723 కేసులు నమోదవ్వగా, 32 మంది మరణించారు. ఢిల్లీలో కొత్తగా 27,561 కేసులు నమోదవ్వగా, 40 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22,155 కేసులు నమోదు అయ్యాయి. వేరియంట్ బారిన పడి 23 మంది చనిపోయారు. కర్ణాటకలో కొత్తగా 21,390 కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు.

Covid in Delhi : ఢిల్లీలో కొత్తగా 27,521 కోవిడ్ కేసులు నమోదు

తమిళనాడులో కొత్తగా 17,934 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, 19 మంది మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్తగా 13,681 కేసులు నమోదయ్యాయి. కేరళలో కొత్తగా 12,472 ఒమిక్రాన్ కేసులు, గుజరాత్‌లో 9,941 కేసులు నమోదు అయ్యాయి.

మరోవైపు దేశంలో కొత్తగా 2,47,41 కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 380 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే 2 శాతం కేసులు పెరిగాయి. దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 4,85,035 మరణాలు నమోదు అయ్యాయి.

Women Police Unit : ఏపీలో మహిళా పోలీసు విభాగం

భారత్ లో 363 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 154.61 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. దేశంలో నిన్న ఒక్కరోజే 76,32,024 డోసుల టీకాలు అందజేశారు.