Supreme Court : జార్ఖండ్ న్యాయమూర్తి హత్య ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

జార్ఖండ్ లో న్యాయమూర్తిని ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. న్యాయమూర్తి హత్యను తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది.

Supreme Court : జార్ఖండ్ న్యాయమూర్తి హత్య ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court : జార్ఖండ్ లో న్యాయమూర్తిని ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. న్యాయమూర్తి హత్యను తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. న్యాయూర్తుల రక్షణపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులిచ్చే యోచనలో సుప్రీం ఉన్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ సీఎస్, డీజీపీని నివేదిక కోరింది.

హత్య కేసుపై జార్ఖండ్ హైకోర్టు విచారణలో జోక్యం చేసుకోబోమని సుప్రీం తెలిపింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. న్యాయాధికారులు, న్యాయవ్యవస్థ తమ విధులు నిర్వర్తించేలా భద్రత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

జార్ఖండ్ లోని ధన్ బాద్ లో బుధవారం (జులై 28,2021) తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కగా జడ్జి ఉత్తమ్ ఆనంద్ జాగింగ్ చేస్తుండగా వేగంగా వచ్చిన ఓ ఆటో ఆయనను ఢీ కొట్టి వెళ్ళిపోయింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అయినా ఆ ఆటో ఆయన్ని చంపాలనే ప్లాన్ తోనే వెనుకవైపు నుంచి ఢీ కొట్టినట్లుగా తెలుస్తోంది.

ఆటో ఢీకొన్న వెంటనే ఆయన అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేసి ఆ ఆటో డ్రైవర్ ను, మరో ఇద్దరినీ అరెస్టు చేయగా..జడ్జిని ఢీకొట్టిన ఆటో కూడా ఎక్కడో దొంగిలించి తీసుకొచ్చిందేనని పోలీసులు విచారణలో తేలింది. ఇది ముమ్మాటికి హత్యేనని పోలీసులు నిర్ధారించారు.