Supreme Court : ఢిల్లీ వాయుకాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీలో వాయుకాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోకపోవడం విచారకరమని సీజేఐ అన్నారు.

Supreme Court : ఢిల్లీ వాయుకాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court

air pollution in Delhi : ఢిల్లీలో వాయుకాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోకపోవడం విచారకరమని సీజేఐ అన్నారు. ఢిల్లీ కాలుష్యంపై రేపు అత్యవసర సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అత్యవసర సమావేశంలో యూపీ, హర్యానా, పంజాబ్ ముఖ్యకార్యదర్శులు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలు వర్క్ ఫ్రమ్ హోం (ఇంటి నుంచే పనిచేయడం) ఆదేశించాలని కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

ఢిల్లీ కాలుష్యానికి పంటవ్యర్థాల దహనం మాత్రమేకాకుండా రవాణా, పరిశ్రమలు, వాహనాలు కాలుష్యానికి కారణమని భావిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. కాలుష్య నియంత్రణ కమిటీ సమావేశమై రేపటిలోగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించింది. ఏ పరిశ్రమలు మూసేయాలి? వాహనాలను ఎలా నియంత్రించాలి? ఏ విద్యుత్ ప్లాంట్లు మూసేయాలి? మూసేస్తే ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు ఏంటి? ఇవన్నీ తమకు రేపటిలోగా తెలియజేయాలన్నారు.

TDP Complaint : మున్సిపల్ పోలింగ్ లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

సుప్రీంకోర్టు సూచించిన అంశాలపై చర్చించి ఏం చర్యలు తీసుకుంటున్నారో ధర్మాసనం చెప్పాలని పేర్కొంది. రైతులు పంట వ్యర్థాలు దహనం చేయకుండా వాయిదా వేసుకోవాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కోరాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంమాని కాలుష్యాన్ని నియంత్రించాలని ఆదేశించింది.

ప్రభుత్వ ప్రచారాలకు ఎంత ఖర్చు చేస్తున్నారో, కాలుష్య నియంత్రణకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆడిట్ చేయమని ఆదేశించే పరిస్థితి తీసుకురావొద్దని తెలిపింది. పంటవ్యర్థాల దహనంపై రైతులపై చర్యలు తీసుకోమని చెప్పడం లేదని స్పష్టం చేశారు. పంట వ్యర్థాల కాల్చివేతను కొద్దిరోజులు వాయిదా వేయమని రైతులను కోరండి అంటూ సూచించింది.

UP Assembly Elections : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోరు.. ఒంటరిగా పోటీ చేయనున్న ప్రధాన పార్టీలు

వాయు కాలుష్య కట్టడికి అవసరమైతే పూర్తి లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ కాలుష్యంలో పంట వ్యర్థాల కాల్చివేత ప్రభావం 10శాతం మాత్రమేనని కేంద్రం తెలిపింది. 74శాతం కాలుష్యానికి పరిశ్రమలు, నిర్మాణ కార్యక్రమాలు, వాహనాలు, రవాణాయే కారణమని కేంద్రం వెల్లడించింది.