మరింత క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం

  • Published By: venkaiahnaidu ,Published On : August 31, 2020 / 03:04 PM IST
మరింత క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మరింత క్షీణిస్తోంది. ఈ నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత 20 రోజులుగా ప్రణబ్.. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా అయన డీప్ కోమాలోనే ఉన్నారు.



ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు తాజాగా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. నిన్నటి నుంచి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు డాక్టర్లు తెలిపారు. డీప్ కోమాలో ఉన్న ప్రణబ్ ముఖర్జీకి వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు డాక్టర్ల బృందం తెలిపింది. ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల ప్రణబ్ ముఖర్జీ సెప్టిక్ షాక్‌లో ఉన్నారని తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం… ఆయన్ని దగ్గరుండి చూసుకుంటోందని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు కోరుకుంటున్నారు.

రెండు వారాల క్రితం… తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని స్వయంగా ప్రణబ్.. ట్వీట్ ద్వారా తెలిపారు. తాను వేరే కారణాలతో ఆస్పత్రికి వెళ్లగా.. తనకు కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రణబ్ ముఖర్జీకి రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం… ఆయన్ని దగ్గరుండి చూసుకుంటోందని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.