Ramdev Baba : అల్లోపతి తగ్గించలేని వ్యాధుల్ని కూడా ఆయుర్వేదం తగ్గిస్తుంది : మరోసారి రాందేవ్ బాబా వ్యాఖ్యలు

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి ఇంగ్లిష్ వైద్యం(అల్లోపతి వైద్యం)పై విమర్శలు చేశారు. అల్లోపతి తగ్గించలేని వ్యాధుల్ని కూడా ఆయుర్వేదం తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు.

Ramdev Baba : అల్లోపతి తగ్గించలేని వ్యాధుల్ని కూడా ఆయుర్వేదం తగ్గిస్తుంది : మరోసారి రాందేవ్ బాబా వ్యాఖ్యలు

Yoga guru Ramdev baba Allopathy, aayurvedam

Updated On : March 21, 2023 / 11:08 AM IST

Ramdev Baba : ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి ఇంగ్లిష్ వైద్యం(అల్లోపతి వైద్యం)పై విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ రిషికుల్ ఆయుర్వేద యూనివర్శిటీ, దీనదయాళ్ కామధేను గౌశాల సమితి సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ ఆయుర్వేద సమ్మేళనం2023 ముంగిపు సమావేశంలో పాల్గొన్న రామ్ దేవ్ బాబు అల్లోపతి వైద్యాన్ని మరోసారి టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అల్లోపతి వైద్యంలో కేన్సర్, హై హైబీపీ, మధుమేహం వంటి సుదీర్ఘకాలపు వ్యాధులకు చికిత్స లేదని..కానీ ఆయుర్వేద వైద్యంతో వీటిని పూర్తిగా నయం చేయవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ఈకార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేబినెట్ మంత్రి సత్పాల్ మహారాజ్, ఆయుర్వేద యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ సునీల్ జోషి కూడా హాజరయ్యారు. వీరందరి సమక్షంలోనే రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆవు పాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని…ఆవుపాలతో ఎన్నో వ్యాధులను నయం చేయవచ్చని అన్నారు. ఆవుపాలతోనే కాదు గోమూత్రం కూడా ఔషధంగా ఉపయోగపడుతుందని గోమూత్రం, ఆయుర్వేద ఔషధాల కలయికతో కేన్సర్ వంటి వ్యాధులను సహజసిద్ధంగా నయం చేస్తుందని మా సంస్థలో ఈ వ్యాధుల్ని నయం చేసామని చెప్పుకొచ్చారు రాందేవ్ బాబా. కాగా..గతంలో కూడా రాందేవ్ బాబా అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.