‘ఏం చేస్తున్నావ్.. నాకు కోపం వస్తే నీ జుట్టు కత్తిరిస్తా’

‘ఏం చేస్తున్నావ్.. నాకు కోపం వస్తే నీ జుట్టు కత్తిరిస్తా’

పిల్లలకు హెయిర్ కట్ చేయించాలంటే పేరెంట్స్ తంటాలు అంతాఇంతా కాదు. గంటలకొద్దీ టైం కేటాయించి వారిని ఒప్పించి చేయించేసరికి.. మన పరిస్థితిని చెప్పనవసర్లేదు. తన కొడుకు హెయిర్ కట్ కోసం వెళ్లిన సీన్ ను వీడియో తీసిన అనూప్ పేట్కర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

‘అర్రె ఏం చేస్తున్నావ్.. నాకు కోపం వస్తుంది. నిన్ను కొడతా. నేను కూడా నీ జట్టు కత్తిరిస్తా. నేను చాలా పెద్దోడ్ని, నిన్ను కటింగ్ చేయనివ్వను’ అంటూ ఆ బుడ్డోడి కోపంగా ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.



ఆ బుడ్డోడి హెయర్ కట్ పూర్తయ్యాక మరో వీడియోను పోస్టు చేశాడు . కటింగ్ చేసే అంకుల్ పొడుగాటి జుట్టును కత్తిరించేస్తా. కోపం తగ్గించుకోమని తండ్రి వారిస్తుంటే మరింత ఫైర్ అయిపోవడం ఆ బుడ్డోడి వంతైంది.

కాకపోతే ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీగా లైకులతో పాటు షేరింగ్ లు కూడా వస్తున్నాయి. యాక్టర్లు కూడా వీడియోను షేర్ చేసి స్మైలీతో తమ ఫీలింగ్ పంచుకుంటున్నారు. ఈ క్యూట్ వీడియోపై మీరూ లుక్కేయండి మరి.