ఢిల్లీలో 03 డిగ్రీల టెంపరేచర్, 65 ఏళ్ల రైతు ఆందోళన

ఢిల్లీలో 03 డిగ్రీల టెంపరేచర్, 65 ఏళ్ల రైతు ఆందోళన

Three-degree temperature in Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 23 రోజూ కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. ఢిల్లీ యూపీ ఘజిపూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఆరు పదుల వయస్సులో.. ఓ వృద్ధ రైతు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టాడు. చలి వల్ల రైతులు చనిపోతున్నా.. కేంద్రం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

15 రోజుల నుంచి ఇక్కడ ఆందోళనల్లో పాల్గొంటున్నానని, చలికి భయం లేదని తెలిపారు. కొంతమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల వల్ల రైతులకు నష్టాలు కలుగుతాయని, వెంటనే వీటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో నలుగురు ఉంటే..ఇద్దరు ఇంటివద్దనే ఉంటారని, మిగతా ఇద్దరు ఆందోళనల్లో పాల్గొంటారని తెలిపారు. తాము వెళ్లిన తర్వాత..ఆ ఇద్దరు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.

దేశ రాజధానిలో రైతులు ఇంకా కదం తొక్కుతూనే ఉన్నారు. సరిహద్దుల వద్ద భారీగా రైతులు మోహరించి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా భేటీ అయి చర్చించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ వీరు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళన సుప్రీంకోర్టుకు చేరుకుంది. వివాదా పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ధర్మాసనం ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల ఆందోళనలకు ప్రముఖులు సైతం మద్దతు తెలియచేస్తున్నారు. రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ…ఓ సిక్కు మత బోధకుడు సింఘు సరిహద్దు వద్ద ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మరి వీరి ఆందోళనకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.