Trade with Pak: సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపితేనే పాక్‌తో వాణిజ్య సంబంధాలు: స్పష్టం చేసిన భారత్

భారత్ నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని పాక్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపితేనే, ఆ దేశంతో వాణిజ్య సంబంధాల్ని పునరుద్ధరిస్తామని చెప్పింది.

Trade with Pak: సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపితేనే పాక్‌తో వాణిజ్య సంబంధాలు: స్పష్టం చేసిన భారత్

Trade with Pak: సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపేస్తేనే పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాల్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది భారత్. కొద్ది రోజులుగా పాకిస్తాన్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలోని కీలక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఈ కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. అంతంతమాత్రమే ఉన్న వ్యవసాయ రంగం కూడా దెబ్బతింది. దీంతో పాకిస్తాన్ చూపు ఇప్పుడు భారత్‌పై పడింది. భారత్ నుంచి కూరగాయలు, ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని పాక్ ఆర్థిక శాఖ మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ప్రకటించారు. నిజానికి ఇరు దేశాల మధ్య చాలా కాలం నుంచి వ్యాపార, వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి. భారత్ నుంచి దిగుమతుల్ని పాక్ నిలిపివేసింది. ఈ నిర్ణయం వల్ల నష్టపోయింది పాకిస్తానే. కానీ, ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌పై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఆ దేశం ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కించగలిగేది భారత్ మాత్రమే. అందుకే ఆ దేశం మెల్లిగా తన వైఖరి మార్చుకుంటోంది.

Bandi Sanjay: బీజేపీని ఆదరించడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు: బండి సంజయ్

మన దేశం నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెబుతోంది. అయితే, భారత్ మాత్రం ఈ విషయంలో పట్టుదలగా ఉంది. సరిహద్దుల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించింది. సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపితేనే, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. 50 మందికి సంబంధించిన తీవ్రవాదుల సమాచారాన్ని ఆ దేశానికి అందించామని, వారంతా సరిహద్దుల్లో కాచుకుని ఉన్నారని భారత్ చెప్పింది. అలాంటివారిపై చర్యలు తీసుకుంటేనే, వాణిజ్యానికి సహకరిస్తామని చెప్పింది.