అర్నబ్ గోస్వామికి బెయిల్ ఇచ్చిన సుప్రీం

అర్నబ్ గోస్వామికి బెయిల్ ఇచ్చిన సుప్రీం

రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామికి సుప్రీం కోర్ట్ ఇన్‌టెర్మ్ బెయిల్‌కు అనుమతి ఇచ్చింది. 2018సూసైడ్ కేసులో భాగంగా జరిపిన న్యాయ విచారణలో గత వారం అర్నబ్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆర్కిటెక్ట్ అన్వయ్ మాలిక్, అతని తల్లి సూసైడ్ చేసుకున్న ఘటనపై విచారణలో బుధవారం బెయిల్ ఇచ్చింది సుప్రీం.

ఇద్దరు జడ్జిల బెంచ్ డీవై చంద్రచద్, ఇందిరా బెనర్జీ సంయుక్తంగా వీడియో కాన్ఫిరెనస్ ద్వారా టీవీ యాంకర్ అరెస్ట్ పిటిషన్ పై సమీక్షించారు. ‘రాజ్యాంగాన్ని పరిరక్షించే కోర్టుగా న్యాయం, స్వేచ్ఛని కాపాడకపోతే ఇక ఎవరు పట్టించుకుంటారు’ అని హియరింగ్‌లో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.



అర్నబ్ గోస్వామి కేసు విషయంలో తప్పక సహకరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రూ.50వేల పూచీకత్తుపై ముగ్గురికి బెయిల్ ఇష్యూ చేస్తూ రెండ్రోజుల్లో రిలీజ్ చేయాలని వెల్లడించింది.

గోస్వామి అరెస్టు గురించి కేసు రీ ఓపెన్ గురించి బాంబే హై కోర్టు నిరాకరించడంతో హియరింగ్ అక్కడి వరకూ వెళ్లింది. జర్నలిస్టు బెయిల్ రిక్వెస్ట్ లోయర్ కోర్టుకు పంపి నాలుగు రోజుల్లోగా నిర్ణయం తెలియజేయాలని ఆదేశించింది. బుధవారం జరిగిన టీవీ యాంకర్ అరెస్టుపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్ధేశించి వారించింది సుప్రీం.

ముంబై పోలీసుల కథనం ప్రకారం.. రిపబ్లిక్ టీవీ రూపకర్త అన్వయ్ నాయక్.. గోస్వామితో పాటు మరో ఇద్దరి గురించి సూసైడ్ నోట్ లో రాయడంతో కేసు ఫైల్ అయింది. రెండేళ్ల క్రితం సాక్ష్యాలు లేవని క్లోజ్ చేసిన కేసును రీసెంట్ గా నాయక్ కుటుంబ రిక్వెస్ట్ మేరకు రీఓపెన్ చేశారు.