National Unity Day : స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాలు జరిగాయ్..షా కీలక వ్యాఖ్యలు

భారతదేశపు ఐక్యమత్యత మరియు సమగ్రతను ఎవ్వరూ నాశనం చేయలేరనే సందేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ ఈ ప్రపంచానికి ఇచ్చారని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ తొలి ఉప ప్రధాని సర

National Unity Day : స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాలు జరిగాయ్..షా కీలక వ్యాఖ్యలు

Amith

National Unity Day  భారతదేశపు ఐక్యమత్యత మరియు సమగ్రతను ఎవ్వరూ నాశనం చేయలేరనే సందేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ ఈ ప్రపంచానికి ఇచ్చారని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి(‘జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా ఆయనకు అమిత్‌షా ఘనంగా నివాళులర్పించారు.

గుజరాత్‌లోని కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్దకు చేరుకొని పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించిన అమిత్ షా.. కెవడియా కేవలం ఒక ప్రాంతానికి పెట్టిన పేరు కాదని, జాతీయ ఐక్యత, దేశభక్తి మందిరమన్నారు. ఇక్కడ నిర్మించిన పటేల్ విగ్రహం భారత ఉజ్వల భవిష్యత్తును ప్రపంచానికి చాటిచెబుతోందన్నారు.

దేశాన్ని విడొగట్టాలనే బ్రిటిష్ వారి కుట్రలను పటేల్ విఫలం చేసి..అఖండ భారత్ నిర్మాణానికి కృషి చేశారని పటేల్‌ను అమిత్ షా కొనియాడారు. స్వాతంత్య్రం అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను, ఆయన సేవలను కనుమరుగు చేసే ప్రయత్నాలు జరిగాయన్నారు. పటేల్ కు భారతరత్న ఇవ్వలేదని, ఆయన సేవలకు సరైన గౌరవవద ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందన్నారు. పటేల్ కు భారతరత్న ఇచ్చుకున్నామని.. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహమే మారిన వాస్తవాలకు ఉదాహరణ అంటూ అమిత్ షా తెలిపారు.

ALSO READ PM Modi : రోమ్ కు మళ్లీ వెళ్లాలని..ట్రెవీ ఫౌంటెయిన్​ లో కాయిన్ విసిరిన మోదీ