హైలెట్స్ ఇలా : బడ్జెట్‌లో మనకు వచ్చింది ఏంటీ

  • Published By: madhu ,Published On : February 1, 2019 / 08:25 AM IST
హైలెట్స్ ఇలా : బడ్జెట్‌లో మనకు వచ్చింది ఏంటీ

ఢిల్లీ : త్వరలో ఎన్నికలు…ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే విధంగా మోడీ ప్రభుత్వం బాణం ఎక్కు పెట్టింది. తాత్కాలిక బడ్జెట్‌లో ఓటర్లపై వరాల జల్లు కురిపించేసింది. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్‌లో పీయూష్ గోయల్ ఎన్నికలల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ జనరంజకంగా ఉందంటూ బీజేపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మోడీ అయితే…పదే పదే బల్ల చరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ అయిన రైతు బందు పథకాన్ని మోడీ ప్రకటించారు. మధ్యతరగతి ప్రజలకు ఊరట వచ్చే విధంగా ప్రకటించారు. 

బడ్జెట్‌లో హైలెట్స్ : 
* ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు. రూ. 2 లక్షల వరకు గృహరుణాలు, జాతీయ ఫించన్ పథకం, ఆరోగ్య బీమా చెల్లించే వారికి పన్ను ఇక చెల్లించాల్సినవసరం లేదు. ప్రతిపాదిత పొదుపు పథకాలు, ప్రావిడెంట్ ఫండ్ పథకాల్లో పెట్టబడులు పెట్టే వారికి కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు. 
* ఇక రైతుల విషయానికి వస్తే…ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ కింద 5 ఎకరాలలోపు రైతులకు ఏటా రూ. 6000 చెల్లింపు. మూడు విడతలు అంటే రూ. 2000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ. ఇందుకు రూ. 75 వేల కోట్లు కేటాయింపు.
* ప్రకృతి విపత్తులకు గురయిన ప్రాంతాల్లో రైతులు రుణాలు తీసుకుంటే…వారికి 2 శాతం వడ్డీ రాయితీ. సకాలంలో చెల్లింపులు చేస్తే వారికి రూ. 3 శాతం వడ్డీ రాయితీ. 
* రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద రూ. 750 కోట్లు కేటాయింపు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ.  
* పోస్టాపీస్‌లో పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్ రూ. 10 వేల నుండి రూ. 40వేలకు పెంపు.
* రూ. 40వేల నుండి రూ.50 వేలకు స్టాండర్డ్ డిడక్షన్ పెంపు.
* రూ. 5 కోట్ల కంటే తక్కువగా టర్నోవర్ ఉన్న వారు 3 నెలలకొకసారి జీఎస్టీ రిటర్న్ దాఖలుకు అవకాశం. 
* ఇంటి అద్దెలపై టీడీఎస్ రూ. 1.80 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంపు. 
* రెండో గృహానికి అద్దె చెల్లించే వారికి ఆదాయ పన్ను ఉండదు. 
* సెక్షన్ 54 కింద ఇళ్లపై పెట్టుబడులు పెట్టవచ్చు. పేదలకు ఇళ్ల పథకం కింద 2020 లోపు రిజిష్టర్ చేసుకున్న వారికి ఆదాయపన్ను మినహాయింపు. 
* ప్రధాన మంత్రి శ్రమ్ యోజన పథకం కింద నెలకు రూ. 3వేలు ఫించన్. ఎస్టీ, ఎస్సీ సంక్షేమ నిధి రూ. 62, 574 కోట్ల నుండి రూ. 76, 800 కోట్లకు పెంపు. 
* జాతీయ విద్యా స్కీమ్‌కు రూ.38,570కోట్లు. 
* పక్కా రోడ్ల నిర్మాణానికి రూ. 19వేల కోట్లు. 
* ఈశ్యాన్య భారతదేశానికి కేటాయింపులు రూ. 58 వేల 166 కోట్లు. 
* సైనిక దళాల వేతనాల పెంపు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ రూ. 35వేల కోట్లు కేటాయింపు. 
* రక్షణ బలగాలకు రూ. 3 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు.
* ఇండియా సిని నిర్మాణ సంస్థలకు సింగిల్ విండో క్లియరెన్స్. సినీ పైరసీ అరికట్టడానికి సినిమాటోగ్రఫీ చట్టం. 
* ప్రత్యేక మత్స్యశాఖ ఏర్పాటు. పశు, చేపల పెంపకం రైతులకు రెండు శాతం వడ్డీ సబ్సిడీ. 
* ఈఎస్‌ఐ పరిమితి రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంపు.
* 2022 నాటికి అంతరిక్షంలోకి మానవుడిని పంపే గగన్‌యాన్‌ పథకం.