Unlock 5.0 గైడ్ లైన్స్ : సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లకు గ్రీన్ సిగ్నల్

  • Published By: sreehari ,Published On : September 30, 2020 / 08:22 PM IST
Unlock 5.0 గైడ్ లైన్స్ : సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లకు గ్రీన్ సిగ్నల్

Unlock 5.0 Guidelines : అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి అన్ లాక్ 5.0 అమల్లోకి రానుంది. ఇప్పటివరకూ కొన్నింటికి మాత్రమే అనుమతినిచ్చిన కేంద్రం.. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది.



స్కూళ్లు, కాలేజీలపై రాష్ట్రాలదే నిర్ణయం :
స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలు తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం కానుంది. ఆన్ లైన్ క్లాసుల విధానాన్ని కూడా కొనసాగించవచ్చునని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. విద్య, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, రాజకీయ సమావేశాలకు 100 మందికి మించి అనుమతించే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది కేంద్రం.



అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగనుంది. క్రీడా అవసరాల కోసం స్విమ్మింగ్ పూల్స్ కు అనుమతించనుంది. పశ్చిమ బెంగాల్ లో అక్టోబర్ 1 నుంచి థియేటర్లకు అనుమతినిచ్చింది అక్కడి ప్రభుత్వం. టూరిజంపై అన్ని ఆంక్షల్ని ఉత్తరాఖండ్ సర్కార్ ఎత్తేసింది.



ఇప్పటికే ఆన్ లైన్ క్లాస్ లను స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించాయి. మరికొన్ని వారాల పాటు స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వొద్దని పేరెంట్స్ అంటున్నారు.

కంటైన్ మెంట్ జోన్ల బయట ప్రాంతాల్లో అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్సులు తెరిచేందుకు అనుమతినిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్లు, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు తెరుచుకోవచ్చునని తెలిపింది.



కంటైన్ మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ Unlock 5.0 మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు దశలవారీగా తెరిచేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిర్ణయాన్ని కేంద్రం వదిలిపెట్టింది.