UP Elections: 20లక్షల జాబ్‌లు కల్పిస్తాం.. కాంగ్రెస్ అజెండా డెవలప్మెంట్ మాత్రమే

కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. పలు వాగ్దానాలు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు పురస్కరించుకొని తాము గెలిస్తే 20లక్షల మందికి ఉద్యోగాలు.....

UP Elections: 20లక్షల జాబ్‌లు కల్పిస్తాం.. కాంగ్రెస్ అజెండా డెవలప్మెంట్ మాత్రమే

Priyanka Gandhi

UP Elections: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. పలు వాగ్దానాలు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు పురస్కరించుకొని తాము గెలిస్తే 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి జిల్లాలో ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

‘కాంగ్రెస్ అభివృద్ధి కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. 20లక్షల వరకూ ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు రెడీ చేస్తాం’ అని ప్రియాంక అన్నారు. మొరదాబాద్ లోని ప్రతిగ్యా ర్యాలీలో పాల్గొన్న ఆమె ఇలా మాట్లాడారు.

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ.. రైతు చట్టాల నేపథ్యంలో చేసిన ఆందోళనలో చనిపోయిన రైతుల పట్ల గౌరవం చూపించలేదని అన్నారు. చెరకు పండించే రైతులకు చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.4వేల కోట్ల వరకూ ఉంటుంది. కొవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి విమానం కొనుక్కోవడానికి మోదీకి రూ.8వేల కోట్లు ఖర్చు అయ్యాయి. అంతేకాదు పార్లమెంట్ సుందరీకరణకు రూ.20వేల కోట్లు కేటాయించారు. కానీ, ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడానికి మాత్రం డబ్బుల్లేవని అంటున్నారు.

……………………………………….: విదేశాల నుంచి ఆంధ్రాకు వచ్చిన 30మంది మిస్సింగ్

శీతాకాలం ఫెర్టిలైజర్స్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు ప్రభుత్వం సహకారం కల్పించడం లేదని ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. ఫెర్టిలైజర్స్ కొరతతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చనిపోయిన ఇద్దరు రైతుల కుటుంబాలను కలిశాను. వాళ్లు పండించిన గోధుమ పంటకు క్వింటాకు రూ.2వేల 500, చెరకు క్వింటాల్ రూ.400మాత్రమే అందుకుంటున్నారు. వారందరి పేర్లపైన ఉన్న రుణాలను మాఫీ చేస్తాం’ అని చెప్పారు ప్రియాంక గాంధీ.