Used PPE Kits Re-sale: దారుణం: ఒకసారి వాడి పడేసిన పీపీఈ కిట్లను మళ్లీ అమ్ముతున్నారు.

రోనాతో దేశం అల్లాడుతుంటే.. కొందరు దీనినే సాకుగా తీసుకోని కోట్లు గడిస్తున్నారు. అక్రమంగా మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ లక్షలకు లక్షలు గడిస్తున్నారు. ఇక కొందరైతే మరి దిగజారి ఒకసారి వాడిన పీపీఈ కిట్లను మళ్లీ వాష్ చేసి అమ్ముతున్నారు.

Used PPE Kits Re-sale: దారుణం: ఒకసారి వాడి పడేసిన పీపీఈ కిట్లను మళ్లీ అమ్ముతున్నారు.

Used Ppe Kits Re Sale

Used PPE Kits Re-sale: కరోనాతో దేశం అల్లాడుతుంటే.. కొందరు దీనినే సాకుగా తీసుకోని కోట్లు గడిస్తున్నారు. అక్రమంగా మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ లక్షలకు లక్షలు గడిస్తున్నారు. ఇక కొందరైతే మరి దిగజారి ఒకసారి వాడిన పీపీఈ కిట్లను మళ్లీ వాష్ చేసి అమ్ముతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

వాడిపారేసిన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లను తిరిగి అమ్మెందుకు వాష్ చేస్తున్నారు. కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ ఘటన సాట్నా జిల్లా బర్కెడా గ్రామంలోని బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ యూనిట్‌లో వెలుగుచూసింది.

ఈ వీడియోలో మాస్కులు ధరించిన కొంత మంది.. గతంలో వాడిన గ్లోవ్స్, మాస్కులు వాష్ చేస్తూ కనిపించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకసారి ఒకసారి వాడిన వాటిని జాగ్రత్తగా డిస్పోజ్ చెయ్యాలి. కానీ వీరు మాత్రం వాటిని ఉతికి కొత్తవాటిలా కనిపించేలా చేసి విక్రయిస్తున్నారు.

ఈ విషయం సాట్నా జిల్లా కలెక్టర్ వద్దకు చేరడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత ఈ కేసును మధ్యప్రదేశ్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డుకు బదిలీ చేశారు. ఘటన జరిగిన ప్లాంట్‌ను అధికారులు విజిట్ చేశారు. విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.