Theft in Police Station : ఎంత ధైర్యం..ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోంచి తుపాకీ, యూనీఫాం ఎత్తుకుపోయిన దొంగలు..

సాధారణ పౌరుల ఇళ్లల్లో దొంగతనాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటాం. కానీ పోలీసులే లూటీకి గురి అయితే? ఏకంగా పోలీస్ట్ స్టేషన్ లోనే చోరీ జరిగితే? అదే జరిగింది ఉత్తరప్రదేశ్ లో..ఏకంగా దొంగలు పోలీస్ స్టేషన్ లో తుపాకీ..పోలీసుల యూనిఫామ్ లను ఎత్తుకుపోయారు..

Theft in Police Station : ఎంత ధైర్యం..ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోంచి తుపాకీ, యూనీఫాం ఎత్తుకుపోయిన దొంగలు..

Weapon, uniform stolen from Kanpur police station

Theft in Police Station : సాధారణ పౌరుల ఇళ్లల్లో దొంగతనాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటాం. ఫిర్యాదు చేసిన దొంగలను పట్టుకోవాలని లూటీ అయిన సొమ్ము తిరిగి వచ్చేలా చేయమని కోరుతుంటాం. కానీ పోలీసులే లూటీకి గురి అయితే. ఏకంగా పోలీస్ట్ స్టేషన్ లోనే చోరీ జరిగితే? పరిస్థితి ఏంటీ? ఇక పోలీసులు ప్రతిష్టం ఏంకాను?కానీ అదే జరిగింది ఉత్తరప్రదేశ్ లో..ఏకంగా దొంగలు పోలీస్ స్టేషన్ లో తుపాకీ..పోలీసుల యూనిఫామ్ లను ఎత్తుకుపోయారు..అంతేకాదు ఏకంగా స్టేషన్ లోనే కొన్ని వస్తువుల్ని పగులగొట్టి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఎంత ధైర్యం..ఈ దొంగలకు..పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం చేస్తారా?మీ పని పడతాం అంటున్నారు. ఈచోరీ దొంగల్ని పట్టుకుని శిక్షించటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు.కేసును ఛేదించటానికి ఏకంగా ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు.

దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా వచ్చింది అప్పట్లో..కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు. ఖాకీ చేతుల్లో ఉండాల్సిన తుపాకీనే కాదు పోలీస్‌ యూనీఫాం, పది కాట్రిజ్‌లును కూడా దొంగలు ఎత్తుకుపోయారు. పోలీసులకే సవాల్‌గా మారిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాన్పూర్‌లోని న్యూ ఆజాద్‌ నగర్‌ పరిధిలోని బిద్నూ ఔట్‌పోస్టులో బుధవారం (నవంబర్ 9,2022) రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసు పిస్తోల్‌తోపాటు యూనిఫాంను ఎత్తుకెళ్లారు. తుపాకీ కనింపించకపోవడంతో.. ఔట్‌పోస్ట్‌ ఇన్‌చార్జీ సుధాకర్‌ పాండే కేసు నమోదుచేశారు.

కాన్పూర్‌లోని బిద్నులో, బిద్ను పోలీస్ స్టేషన్‌లోని న్యూ ఆజాద్ నగర్‌లో బుధవారం రాత్రి ఔట్‌పోస్టును లక్ష్యంగా చేసుకుని గాఢనిద్రలో ఉన్న సుధాకర్ పాండే పక్కనే ఉన్న పెట్టెను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే విషయం కాస్తా పై అధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా ఎస్పీ.. సుధారక్‌ పాండేలను సస్పెండ్ చేశారు.పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ తుపాకీతోపాటు యూనీఫాం, పది కాట్రిజ్‌లు కనిపించకుండా పోయాయని గుర్తించారు. ఈ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.