Munawar Faruqui: మునావర్ షోను రద్దు చేయండి.. ఢీల్లీ పోలీసులకు వీహెచ్‌పీ లేఖ

వచ్చే వారం ఢిల్లీలో జరగబోయే మునావర్ ఫారుఖి స్టాండప్ కామెడీ షోను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు వీహెచ్‌పీ లేఖ రాసింది. షోను రద్దు చేయకుంటే అడ్డుకుని తీరుతామని హెచ్చరించింది. ఆందోళన చేపడతామని కూడా తెలిపింది.

Munawar Faruqui: మునావర్ షోను రద్దు చేయండి.. ఢీల్లీ పోలీసులకు వీహెచ్‌పీ లేఖ

Munawar Faruqui: ఢిల్లీలో జరగబోయే మునావర్ ఫారూఖి స్టాండప్ కామెడీ షోను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు వీహెచ్‌పీ (విశ్వ హిందూ పరిషత్) లేఖ రాసింది. వీహెచ్‌పీ, ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గుప్తా ఈ మేరకు గురువారం లేఖ రాశారు. ఈ నెల 28న ఢిల్లీలోని కేదార్‌నాథ్ స్టేడియంలో మునావర్ ఫారూఖి కామెడీ షో నిర్వహించబోతున్నారు.

CM KCR: పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? ప్రశ్నించిన సీఎం కేసీఆర్

దీనిపై వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో మునావర్ తన షోలో హిందూ దేవతల్ని అవమానించేలా కామెడీ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్నుంచి ఆయన షోను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మునావర్ షోను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు వీహెచ్‌పీ లేఖ రాసింది. ‘‘మునావర్ తన షోలో హిందూ దేవుళ్లని అవమానిస్తాడు. వీటి ఫలితంగా భాగ్యనగర్ (హైదరాబాద్)లో మత ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అతడి షోను వెంటనే రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ షోను రద్దు చేయకుంటే వీహెచ్‌పీతోపాటు, భజరంగ్ దళ్ సభ్యులు నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వీహెచ్‌పీ తన లేఖలో పేర్కొంది.

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. 27న హన్మకొండలో భారీ సభ

గతవారం మునావర్ ఫారూఖీ హైదరాబాద్‌లో షో నిర్వహించిన సంగతి తెలిసిందే. వేల మంది పోలీసు బందోబస్తు మధ్య శిల్పకళావేదికలో ఈ షో జరిగింది. మరోవైపు ఇటీవలే బెంగళూరులో జరగాల్సి ఉన్న షోను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. బెంగళూరులో మునావర్ షో రద్దవడం ఇది రెండోసారి. గత ఏడాది నవంబర్‌లో మొదటిసారి అతడి షో రద్దైంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు అతడి షోలపై నిషేధం విధించాయి.