400 సంవత్సరాల మర్రిచెట్టును కాపాడుకున్న గ్రామస్తులు..జాతీయ రహదారి నిర్మాణంలో మార్పులు

  • Published By: madhu ,Published On : July 25, 2020 / 09:56 AM IST
400 సంవత్సరాల మర్రిచెట్టును కాపాడుకున్న గ్రామస్తులు..జాతీయ రహదారి నిర్మాణంలో మార్పులు

ఒక సంవత్సరం కాదు…రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు కాదు ఏకంగా 400 సంవత్సరాల కిందట మర్రిచెట్టు అది. దానిని కాపాడుకోవడానికి గ్రామస్తులు ప్రచారం నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మర్రిచెట్టును తీసివేయద్దని అన్న గ్రామస్తుల ఆశ నెరవేరబోతోంది. రాష్ట్ర పర్యాటక, పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే..కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు.

సాంగ్లీ జిల్లాలో Ratnagiri-Solapur highway ప్రాజెక్టును రూపొందించారు. అయితే నిర్మాణంలో భాగంగా…400 సంవత్సరాల మర్రిచెట్టును తొలగించాల్సి ఉంటుందని అధికారులు నిర్ణయించారు. ఈ మర్రిచెట్టును కాపాడుకోవాలని Bhose Village నిర్ణయించారు. దీనిపై విపరీతంగా ప్రచారం నిర్వహించారు.

ఎల్లమ్మ మందిరానికి సమీపంలో 400 సంవత్సరాల ఈ మర్రిచెట్టు ఉంది. దాదాపు 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. అనేక జాతుల పక్షులు, జంతువులకు నిలయంగా ఉంది ఈ చెట్టు. సోషల్ మీడియా ద్వారా మర్రిచెట్టును తొలగించవద్దని కోరారు. ఇది ఎంతో మందిని ఆకర్షించింది.  లేఖకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి సానుకూలంగా స్పందించారని మంత్రి ఆదిత్య ఠాక్రే..వెల్లడించారు.

Ratnagiri-Solapur highway నిర్మాణాన్ని పున: పరిశీలించాలని National Highway Authority of India (NHAI) భావించిందన్నారు. దీనిపై NHAI కి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ…చెట్టు యొక్క ప్రధాన భాగానికి ఏమీ ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామని, అయితే..చెట్టు యొక్క కొన్ని కొమ్మలు మాత్రం కట్ చేస్తామన్నారు.

20 నుంచి 25 మీటర్ల దూరంలో రహదారి నిర్మాణం చేయమని, ఇందులో మార్పులు చేయబడుతుందన్నారు. లాక్ డౌన్ సమయంలో తాము పెద్ద ఎత్తు నిరసన వ్యక్తం చేయలేకపోయామని Bhose గ్రామస్తులు వెల్లడించారు.

మర్రిచెట్టును కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశామని, సామాజిక దూరం చేపడుతూ సమావేశవాలు నిర్వహంచుకోవడం జరిగిందన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విషయాన్ని తెలియచేసే ప్రయత్నం చేశామని, దానిని కాపాడుకోవడం ఎందుకు ముఖ్యమో తాము వివరించామన్నారు.

చెట్టు యొక్క ఫొటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. ఎంత విస్తరించిందో..ఎలా ఉందో చెట్టు యొక్క పరిస్థితులను వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేశారు. ఈ రహదారి గుండా వెళ్లే…వారికి కూడా తాము చెట్టును ఎందుకు కాపాడుకోవాలని అనుకుంటున్నామనో వివరించామన్నారు. మొత్తానికి గ్రామస్తుల ప్రయత్నం నెరవేరిందనే చెప్పాలి.