Viral Video : జిమ్‌లో దెయ్యం….భయంతో పారిపోయిన వ్యక్తి

దెయ్యాల గురించి ఒక్కోక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయనే వాళ్లు కొందరు లేవనే వాళ్లు మరికొందరు ఉంటారు.

Viral Video : జిమ్‌లో దెయ్యం….భయంతో పారిపోయిన వ్యక్తి

Viral Video

Viral Video : దెయ్యాల గురించి ఒక్కోక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయనే వాళ్లు కొందరు లేవనే వాళ్లు మరికొందరు ఉంటారు. ఇంక అంతర్జాలంలో అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అలాంటిదే దెయ్యాలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు ఆ వీడియోను 12మిలియన్లకు మందికి పైగా ఆ వీడియో చూశారు. ఇంతకూ ఇందులో ఏం ఉన్నదంటే జిమ్ కు వచ్చిన ఒక వ్యక్తిని దెయ్యం పరుగులు పెట్టించింది. కాలు పట్టుకుని లాక్కెళ్లింది.

టిక్ టాక్ యూజర్ @carlosruizoficial పోస్ట్ చేసిన ఈవీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా మంది చూశారు. సోషల్ మీడియాలో ఈవీడియో తెగవైరల్ అవుతోంది. దీనిలో జిమ్‌కు వెళ్లిన ఓ వ్యక్తిని అదృశ్య శక్తి ఫ్లోర్ అంతటా లాగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఎక్సర్‌సైజ్‌ కోసం ఓ వ్యక్తి జిమ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో జిమ్‌లో అతనొక్కడే ఉన్నాడు. ఇక అతడు వామప్‌ చేసుకుంటూ ఉండగా.. అతడి వెనక ఉన్న కొన్ని జిమ్‌ పరికరాలు వాటంతట అవే కదులుతుంటాయి.

మొదట జిమ్ లోకి వెళ్లిన వ్యక్తి ఆవిషయాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత మరి కొన్ని పరికరాలు వాటంతట అవే అసాధారణ రీతిలో కదలడం మొదలవుతుంది. వీటన్నింటిని గమనించిన సదరు వ్యక్తి అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని భావించి… బయటకు వెళ్లాలని అనుకుంటాడు. ఇక తనతో పాటు తీసుకువచ్చిన వస్తువులు తీసుకుని బయటకు వెళ్లబోతుండగా…. సడెన్‌గా కిందపడతాడు.

ఆ తర్వాత ఉన్నట్టుండి అతడి కాలు గాల్లోకి లేస్తుంది. ఆ తర్వాత ఎవరో అతడి కాలు పట్టుకుని జిమ్‌ ఫ్లోర్ మీద కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు కనిపించరు. వదిలేయగానే.. ఆ వ్యక్తి ప పరిగెత్తుకుంటూ కిందకు దిగి పరిగెడతాడు. కింద సెక్యూరిటీ వింగ్ లో ఉన్న వ్యక్తికి దెయ్యం ఉన్నవిషయం చెప్పటం ఆ వీడియో లో కనిపిస్తుంది.

వీడియోపై నెటిజనులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఇలాంటి స్టంట్‌లు చేశారు.. అక్కడ దెయ్యం లేదు పాడు లేదు అంటుం‍డగా.. మరి కొందరు దెయ్యం కూడా జిమ్‌ చేద్దామని వచ్చి ఉంటుంది.. అతడు అక్కడే ఉండటం దానికి నచ్చలేదేమో.. అందుకు ఇలా బయటకు గెంటేసింది అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.