గంభీర్‌కు సపోర్ట్‌గా ట్వీట్లు చేసిన క్రికెటర్లు

  • Published By: vamsi ,Published On : May 10, 2019 / 11:30 AM IST
గంభీర్‌కు సపోర్ట్‌గా ట్వీట్లు చేసిన క్రికెటర్లు

పాంప్లెట్‌ల పంపకం వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆప్-బీజేపీ నేతల మాటల యుద్ధం చోటుచేసుకున్నాయి. తన ప్రత్యర్థి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషిపై అసభ్య పదజాలంతో కూడిన కరపత్రాలు ప్రచురించి ముద్రించారంటూ గంభీర్‌పై విమర్శలు వస్తున్న క్రమంలో అతనికి అండగా నిలిచారు కొందరు క్రికెటర్లు.

ఈ వ్యవహారంపై స్పందించిన హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్‌లు.. ఇటువంటి వార్తలు విని షాక్ అయ్యామని.. మహిళలను అవమానించే విధంగా గంభీర్ ఎప్పటికీ ప్రవర్తించడంటూ ట్విట్టర్ వేధికగా ట్వీట్లు చేశారు. ఒక మనిషి గెలుపు, ఓటములు అనేవి తర్వాత విషయం కానీ, వీటన్నింటినీ మించి మానవత్వం అనేది ఎక్కువ స్థాయిలో ఉంటుందని హర్బజన్ అన్నారు.

అలాగే వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ.. ఇటువంటి వార్తలు వినడం బాధగా ఉందని, రెండు దశాబ్దాల నుంచి గంభీర్ తనకు తెలుసు అని మహిళలకు గంభీర్ ఇచ్చే గౌరవం గురించి తనకు తెలుసునని, మహిళలను కించపరిచేలా ఎప్పటికీ గంభీర్ మాట్లాడడని అన్నారు.