Covid నుంచి కోలుకున్న వారికి షాకింగ్ వార్నింగ్

కరోనా బారినపడి కోలుకుంటే యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయి, తమకేమీ కాదనుకుంటున్న వారికి వార్నింగ్ ఇచ్చింది. కోవిడ్ నుంచి కోలుకున్నా డేంజర్ తప్పదని హెచ్చరిస్తున్నారు.

Covid నుంచి కోలుకున్న వారికి షాకింగ్ వార్నింగ్

Covid

India Covid : భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంటే… ఢిల్లీలో జరిపిన ఓ సర్వే… షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చింది. కరోనా బారినపడి కోలుకుంటే యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయి, ఆ తర్వాత తమకేమీ కాదనుకుంటున్న వారికి వార్నింగ్ ఇచ్చింది. కోవిడ్ నుంచి కోలుకున్నా డేంజర్ తప్పదని, వదలబొమ్మాళి వదల అంటూ వైరస్ వెంటాడుతోందని హెచ్చరించింది.

Read More : Covid Cases: భారత్‌లో కరోనా వైరస్: 24 గంటల్లో 45వేలకు పైగా కేసులు

ఢిల్లీలో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్… యాంటీబాడీస్ స్థాయిలపై సర్వే నిర్వహించింది. ఇందులో.. ఫస్ట్‌ వేవ్ లో వైరస్ బారినపడి కోలుకున్న వారిని కూడా కరోనా మళ్లీ కాటు వేస్తున్నట్లు గుర్తించింది. ఏకంగా 27శాతం మంది రెండోసారి కరోనా బారిన పడినట్లు నిర్ధారించింది. ఢిల్లీలో కోవిడ్ బారిన పడిన ప్రతి నలుగురిలో ఒకరిని ఏప్రిల్-మే సమయంలో వైరస్ మరోసారి అటాక్ చేసినట్లు తేలింది. రీ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినట్లు గుర్తించిన వారిలో 10శాతం మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన కరోనా సోకినట్లు కన్ఫామ్ చేయగా… మిగిలిన వారిలో కొందరికి మాత్రం లక్షణాలు కనిపించాయి.

Read More : Deer : జింకకు కరోనా..!

ఢిల్లీ వాసుల్లో ఎంత మందికి యాంటీబాడీస్ ఉన్నాయో నిర్ధారించడానికి మూడు దశలుగా సీరోలాజికల్ పరీక్షలు చేసింది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. 11 జిల్లాల్లో మొత్తం 21వేల 387 మంది నమూనాలను సేకరించింది. గతేడాది జులై – సెప్టెంబర్ మధ్య ఒకసారి, ఈ ఏడాది జనవరి -ఫిబ్రవరి మధ్య రెండోసారి, ఆ తర్వాత మే-జులై మధ్య మూడోసారి సర్వే చేసింది. ఆశ్చర్యకరంగా.. మొదటి సీరో లాజికల్ పరీక్షల తరువాత పెరిగిన యాంటీబాడీ స్థాయిలు రెండవసారి మాత్రం తగ్గిపోయాయి.

Read More : Covaxin Single Dose : వారికి వ్యాక్సిన్ ఒక్క డోసు చాలు.. ICMR గుడ్‌న్యూస్

మూడవ సమయానికి తిరిగి మళ్లీ పెరిగాయి. రెండోసారి సర్వే చేసిన సమయంలోనే డెల్టా వేరియంట్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అదే సమయంలో రీ ఇన్ఫెక్షన్ కేసులు పెరిగాయంటే… డెల్టా వేరియంట్ రోగనిరోధక శక్తిని తగ్గిస్తున్నట్లు నిర్ధారణ అయింది. గతంలో డెల్టా వేరియంట్‌ రోగ నిరోధకశక్తిని బురిడీ కొట్టిస్తుందని అనుమానించగా… ఈ సర్వేతో అది నిజమని నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం మూడోదశ ముప్పు వార్తల నేపథ్యంలో ఇది కలవరానికి గురి చేస్తోంది.