SUV Rape : ఆ కారులో రేప్ చేసేంత స్థలం ఉంటుందా? సీట్లు జరిపితే కుదురుతుందా? పోలీసుల వింత ప్రశ్నలు

ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) లో రేప్ చేసేంత స్థలం ఉంటుందా? సీట్లు జరిపితే కుదురుతుందా? ఛీ..ఛీ.. ఇవేం పిచ్చి ప్రశ్నలు అనుకుంటున్నారా? అసలు ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? అనే సందేహం వచ్చింది కదూ. అవును.. ఈ సందేహం వచ్చింది సాక్షాత్తూ పోలీసులకే.

SUV Rape : ఆ కారులో రేప్ చేసేంత స్థలం ఉంటుందా? సీట్లు జరిపితే కుదురుతుందా? పోలీసుల వింత ప్రశ్నలు

Suv Rape

SUV Rape : ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) లో రేప్ చేసేంత స్థలం ఉంటుందా? సీట్లు జరిపితే కుదురుతుందా? ఛీ..ఛీ.. ఇవేం పిచ్చి ప్రశ్నలు అనుకుంటున్నారా? అసలు ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? అనే సందేహం వచ్చింది కదూ. అవును.. ఈ సందేహం వచ్చింది సాక్షాత్తూ పోలీసులకే. ఈ ప్రశ్నలు అడిగింది వారే. ఎస్‌యూవీ రకానికి చెందిన కారులో ఒక అమ్మాయిని అత్యాచారం చేసేంత స్థలం ఉంటుందా? అందులో చేయడం సాధ్యమా? దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు ఆర్టీవో అధికారులను అడిగారు.

ఓ నేరాన్ని ప‌రిష్క‌రించే క్ర‌మంలో పోలీసులు ఇత‌ర డిపార్ట్‌మెంట్ల సాయం తీసుకోవ‌డం స‌హ‌జ‌మే. అలాగే ఆర్టీవో సాయం కూడా తీసుకుంటారు. కానీ, గుజరాత్ వడోదరలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆర్టీవో అధికారులు షాక్ తిన్నారు. ఓ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ)లో రేప్ చేసేంత స్థ‌లం ఉంటుందా అన్న‌ది పోలీసుల ప్ర‌శ్న. త‌మ కేసును ప‌రిష్క‌రించ‌డానికి ఈ స‌మాచారం ముఖ్య‌మైన‌ద‌ని వాళ్లు చెప్పారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ త‌మను ఇలాంటి స‌మాచారం అడ‌గ‌లేద‌ని ఆర్టీవో అధికారులు చెబుతున్నారు.

స్థానిక నేత‌, అక్ర‌మ దందా న‌డిపే భ‌వేష్ ప‌టేల్‌పై రేప్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అత‌డు త‌న కారు టొయోటా ఫార్చున‌ర్‌లో ఓ మ‌హిళ‌ను రేప్ చేశాడ‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌నిపై ఇదే కాకుండా మ‌రో 18 కేసులూ ఉన్నాయి. దీంతో అత‌న్ని ఎట్టి ప‌రిస్థితితుల్లోనూ విడిచిపెట్టొద్ద‌ని భావించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఈ రేప్ కేసులో బ‌ల‌మైన ఆధారాలు సేకరించాల‌ని సంక‌ల్పించారు. అందులో భాగంగానే ఆ మ‌హిళ చెప్పిన‌ట్లు ఫ్రంట్ సీటు పుష్‌బ్యాక్ చేస్తే అందులో రేప్ చేసేంత స్థ‌లం ఉంటుందా, ఆ కారు సెంట్ర‌ల్ లాకింగ్ సిస్ట‌మ్ బలంగా ఉందా అన్న ప్ర‌శ్న‌లు ఆర్టీవోను అడిగారు.

సెంట్ర‌ల్ లాకింగ్ వ్య‌వస్థ గురించి ఎందుకంటే.. కారు ఆగిన‌ప్పుడు ఆ మ‌హిళ డోరు తీసుకొని ఎందుకు పారిపోలేదు అన్న ప్ర‌శ్న త‌లెత్తిన‌ప్పుడు ఆధారాలు చూపించ‌డానికి. ఈ వింత ప్ర‌శ్న‌లు త‌మ‌కు ఎప్పుడూ ఎదురు కాలేద‌ని ఆర్టీవో అధికారులు చెప్పారు. అయితే తాము మ్యాథ‌మెటిక‌ల్ రిపోర్ట్ మాత్రం ఇస్తామ‌న్నారు. స్థలం ఎంత ఉంటుంది? సీట్లు జరిపితే ఇంకా ఎంత స్థలం ఉంటుందనే వివరాలను మాత్రమే ఇవ్వగలమని చెప్పారు. రేప్ అందులోనే జ‌రిగిందా లేదా అన్న‌ది పోలీసు డిపార్ట్‌మెంట్ వాళ్లే తేల్చాల‌ని ఆర్టీవో అధికారులు చెప్పారు.

ఏప్రిల్ 26 అర్ధరాత్రి సమయంలో ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ కేసులో నిందితుడైన పాద్రా మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్‌ భవేశ్‌ పటేల్‌ను మే 2న అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పటేల్‌ స్థానికంగా పేరున్న నాయకుడని.. అతడిపై ఇదివరకే 18 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో బలమైన ఆధారాలు సంపాదించడం కోసం ఆర్టీవో అధికారులను సంప్రదించినట్లు వివరించారు. మొత్తంగా ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది.